AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu: వారెవ్వా.. ఈసారి షో అదిరిపోద్ది.. బిగ్ బాస్ 10లోకి అందాల ముద్దుగుమ్మలు.. ఫైనల్ లిస్ట్ ఇదే..

మరికొన్ని రోజుల్లో అసలైన ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ కాబోతుంది. అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 10 త్వరలోనే ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. అటు అగ్నీ పరీక్షతోపాటు ఇటు సెలబ్రేటీల పేర్లు సైతం గట్టిగానే వినిపిస్తున్నాయి. తాజాగా మరికొందరి పేర్లు నెట్టింట మారుమోగుతున్నాయి. ముఖ్యంగా సీరియల్ తారలు ఎక్కువగా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Bigg Boss 10 Telugu: వారెవ్వా.. ఈసారి షో అదిరిపోద్ది.. బిగ్ బాస్ 10లోకి అందాల ముద్దుగుమ్మలు.. ఫైనల్ లిస్ట్ ఇదే..
Bigg Boss 10 Telguu
Rajitha Chanti
|

Updated on: Aug 31, 2026 | 10:59 AM

Share

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు’ 10వ సీజన్‌కు సర్వం సిద్ధమైంది. గత తొమ్మిది సీజన్లుగా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ వస్తున్న ఈ షో, ఇప్పుడు పదవ సీజన్‌తో కొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమవుతోంది. మొదటి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా, మూడో సీజన్ నుండి కింగ్ అక్కినేని నాగార్జున తనదైన శైలిలో షోను విజయవంతంగా నడిపిస్తున్నారు. ఈ 10వ సీజన్‌కు కూడా నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈసారి 10వ సీజన్ కావడంతో నిర్వాహకులు దీనిని ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో డిజైన్ చేశారు. ప్రచారంలో ఉన్న వివరాల ప్రకారం, ప్రారంభంలో కేవలం 10 మంది కంటెస్టెంట్లు మాత్రమే ఇంట్లోకి అడుగుపెడతారు. ఆ తర్వాత షో ముందుకు సాగే కొద్దీ మిడ్-వీక్ ఎంట్రీలు, వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా మరికొంతమంది సెలబ్రిటీలను పంపించి షోలో మరింత వినోదాన్ని నింపేలా ప్లాన్ చేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్..

అంతేకాకుండా, ఈ సీజన్ కోసం ‘కామన్ మ్యాన్’ కేటగిరీ కింద సాధారణ ప్రజల నుంచి కూడా కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిర్వహించిన టాలెంట్ హంట్ రౌండ్స్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ ఆడిషన్స్ ద్వారా ఇద్దరు లేదా ముగ్గురు సాధారణ వ్యక్తులు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో పాల్గొనబోయే సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలోనూ, మీడియా వర్గాల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేము.. నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు..

జబర్దస్త్ ఫేమ్ రాంప్రసాద్, నరేష్, కమెడియన్ కృష్ణుడు, నటుడు అదిత్ అరుణ్, ‘టెంపర్’ వంశీ, ప్రముఖ నటి/యాంకర్ వర్షిణి సౌందరరాజన్, ముకేష్ గౌడ, దేబ్జానీ మోదక్, చైత్రా రాయ్, యూట్యూబర్ సుధీర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఈ టాప్ రియాలిటీ షో సెప్టెంబర్ మొదటి వారంలో గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ ఓపెనింగ్ వేడుకతో బిగ్‌బాస్ 10వ సీజన్ ప్రారంభం కానుంది. నాగార్జున గ్రాండ్ ఎంట్రీ కంటెస్టెంట్ల పరిచయ కార్యక్రమాలతో హౌస్ సందడిగా మారనుంది. ఈసారి ‘దశావతారం’ థీమ్‌తో ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..

డెబ్జానీ మోదక్..

చైత్రరాయ్..

ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..

Follow Us