AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu: బిగ్‏బాస్ 10లోకి అడుగుపెట్టేది ఫస్ట్ లేడీ కంటెస్టెంట్.. అగ్నీ పరీక్ష నుంచి నేరుగా హౌస్‏లోకి..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 అత్యంత ఆసక్తికరమైన అంశాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సీజన్ "దశావతారం" అనే వినూత్న థీమ్‌తో రాబోతోంది. కొత్త రూల్స్, మరిన్ని ట్విస్టులతో షో ఫార్మాట్‌ను పూర్తిగా రీవ్యాంప్ చేశారు. కేవలం సెలబ్రిటీలే కాకుండా సామాన్యులకు కూడా ఈసారి పెద్దపీట వేశారు. 'అగ్ని పరీక్ష' అనే డిజిటల్ ప్రైవేట్ షో టాస్కుల ద్వారా ఎంపికైన 4 గురు సాధారణ ప్రజలు హౌస్‌లోకి అడుగుపెడుతున్నారు.

Bigg Boss 10 Telugu: బిగ్‏బాస్ 10లోకి అడుగుపెట్టేది ఫస్ట్ లేడీ కంటెస్టెంట్.. అగ్నీ పరీక్ష నుంచి నేరుగా హౌస్‏లోకి..
Bigg Boss 10 Telugu
Rajitha Chanti
|

Updated on: Aug 30, 2026 | 4:26 PM

Share

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు’. త్వరలోనే బిగ్‌బాస్ సీజన్ 10 అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. గత సీజన్ మాదిరిగానే ఈ షోలో సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా పెద్దపీట వేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో హౌస్‌లోకి వెళ్లబోయే మొదటి లేడీ కంటెస్టెంట్ ఎవరనే దానిపై సోషల్ మీడియాలో కథనాలు మొదలయ్యాయి. అందిన సమాచారం ప్రకారం, ‘అగ్ని పరీక్ష’ వేదికగా తన ప్రతిభను చాటుకుని బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోయే మొదటి మహిళా కంటెస్టెంట్‌గా జానపద గాయని ఝాన్సీ ఎంపికైనట్లు తెలుస్తోంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్..

ఎవరీ ఝాన్సీ?

సూర్యాపేట జిల్లా, చివ్వెంల మండలానికి చెందిన కోమటికుంట గ్రామానికి చెందిన ఝాన్సీ.. ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన మహిళ. ఒకవైపు పొలం పనులు చేస్తూనే, మరోవైపు తన తీయని స్వరంతో జానపద పాటలు పాడుతూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. కష్టపడే తత్వంతో పాటు ఆమె పాడే పాటలు, సహజసిద్ధమైన గ్రామీణ శైలి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ రకంగా సోషల్ మీడియాలో మంచి గుర్తింపును, విశేషమైన క్రేజ్‌ను సంపాదించుకుంది.

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేము.. నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు..

అగ్ని పరీక్షలో సత్తా చాటి బిగ్‌బాస్‌లోకి..

సామాన్యుల విభాగం నుండి కంటెస్టెంట్లను ఎంపిక చేసేందుకు నిర్వహించిన ‘అగ్ని పరీక్ష’లో ఝాన్సీ పాల్గొంది. తన తెలివితేటలు, కష్టపడే తత్వం, అంకితభావంతో టాస్కుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జడ్జిల నుంచి మంచి మార్కులు సాధించింది. అగ్ని పరీక్షలో సక్సెస్ సాధించడంతో ఆమె బిగ్‌బాస్ హౌస్‌లోకి మొదటి లేడీ కంటెస్టెంట్‌గా వెళ్లే అవకాశం దక్కించుకుందని సమాచారం. తన సహజత్వంతో, పాటలతో ఆకట్టుకున్న ఈ పల్లెటూరి పిల్ల బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఎలాంటి ఆటతీరుతో ప్రేక్షకులను మెప్పిస్తుందో, ఎలాంటి గుర్తింపును సాధిస్తుందో వేచి చూడాలి.

ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..

సింగర్ ఝాన్సీ..

ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..

Follow Us