
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఇప్పుడిప్పుడే అసలు ట్విస్టులు మొదలయ్యాయి. ముఖ్యంగా ఓటింగ్ రిజల్ట్స్ గురించి నెట్టింట ఏదోక లీక్డ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఒకవైపు రోహిత్ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ ఫ్యాన్స్ బయట రచ్చ రచ్చ చేస్తుంటే మరో ఎలిమినేషన్ టైం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఆటను మలుపు తిప్పే కీలకమైన ‘ఫ్యామిలీ వీక్’ వచ్చే వారం ఉండటంతో ఈ 9వ వారం ఎలిమినేషన్ అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. గత వారం ఊహించని విధంగా రోహిత్ ఎలిమినేట్ కావడంతో హౌస్‌లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎమోషన్స్, బాధలు, రియాల్టీ ఇలా ఒక్కొ కంటెస్టెంట్ గ్రాఫ్ పెరుగుతూ, తగ్గుతూ వస్తుంది. ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఏకంగా 10 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ క్రమంలోనే ఓటింగ్ లో అసలు ట్విస్టులు మొదలయ్యాయి.
ఈ వారం నామినేషన్ ప్రక్రియలో దేబ్జానీ, నీతూ, వర్షిణి, ముకేష్ గౌడ, టెంపర్ వంశీ, అమన్, సుధీర్, నరేష్, ఆటో రాంప్రసాద్, శివ కుమార్ ఉన్నారు. అయితే త్రిగుణ్ ఈవారం నామినేషన్స్‌లో లేకపోయినా తనదైన వ్యూహాలతో ఇంట్లో చక్రం తిప్పుతున్నాడు. గత వారాలతో పోలిస్తే ఈ వారం ఓటింగ్ లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. సీరియల్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన ముకేష్ గౌడ ఎప్పటిలాగే తన ఫ్యాన్ బేస్ బలంతో ఓటింగ్‌లో ఎవరికీ అందనంత దూరంలో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్నారు. అయితే ఈసారి అందరూ ముకేష్ ను టార్గెట్ చేయడం.. ముఖ్యంగా డేబ్జానీ ప్రవర్తనతో ముఖేష్ ఒక్కసారిగా విన్నర్ రేసులోకి వచ్చాడు. అనధికారిక పోల్స్ ప్రకారం ముకేష్ ఏకంగా 32 శాతం ఓటింగ్‌తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నాడు.
ఇక అనూహ్యంగా టెంపర్ వంశీ 18 శాతం ఓటింగ్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. త్రిగుణ్, వంశీల మధ్య ఉన్న సాన్నిహిత్యం ఓటింగ్ పరంగా వంశీకి బాగా కలిసి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే దేబ్జానీ 10 శాతం ఓటింగ్‌తో మూడో స్థానంలో ఉండగా, నరేష్, అమన్, రాంప్రసాద్‌లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మిగిలిన వాళ్లలో నీతూ, వర్షిణి, శివ కుమార్ ,సుధీర్ తక్కువ ఓట్లతో డేంజర్ జోన్ వైపు పయనిస్తున్నారు.
అన్నింటికంటే ముఖ్యంగా గత వారం ఎలిమినేషన్ నుంచి తృటిలో తప్పించుకున్న సుధీర్, ఈవారం కేవలం 3 శాతం ఓటింగ్‌తో ఆఖరి స్థానంలో ఉన్నాడు.. కంటెంట్ పరంగా శివ కుమార్ గొడవలు, టాస్క్‌లలో తన వంతు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఓటింగ్‌లో వెనుకబడ్డారు. ప్రస్తుతం లీస్ట్ ఓటింగ్‌లో కొనసాగుతున్న సుధీర్ ఈ వారం హౌస్ నుంచి బయటికి వెళ్లే అవకాశాలు అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..