టాలీవుడ్‌ మార్గంలో నడవండి.. కోలీవుడ్‌కి భారతీరాజా సూచన

కరోనా కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లను పునరుద్ధరించడానికి అందరూ ముందుకు రావాలని ప్రముఖ దర్శకుడు భారతీ రాజా అన్నారు

టాలీవుడ్‌ మార్గంలో నడవండి.. కోలీవుడ్‌కి భారతీరాజా సూచన

Edited By:

Updated on: Oct 19, 2020 | 12:10 PM

Bharathi Raja Kollywood: కరోనా కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లను పునరుద్ధరించడానికి అందరూ ముందుకు రావాలని ప్రముఖ దర్శకుడు భారతీ రాజా అన్నారు. టాలీవుడ్‌, మాలీవుడ్‌లో నటీనటులు, టెక్నిషియన్లు వారుగా ముందుకొచ్చి పారితోషికంలో 30 నుంచి 40 శాతం తగ్గించుకున్నారని ఆయన తెలిపారు. అదే విధంగా తమిళ పరిశ్రమకి చెందిన నటీనటులు, టెక్నీషియన్లు.. 10 లక్షలకుపైన పారితోషికం తీసుకుంటున్న వారు 30 నుంచి 50 శాతం రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని ఆయన అన్నారు. ఇప్పటికైనా పరిశ్రమలో ఉన్న అగ్ర నటీనటులు ముందుకు రాకపోతే నిర్మాతలు రోడ్డున పడతారని ఆయన తెలిపారు.

ఇతర పరిశ్రమలో నటీనటులు, నిర్మాతలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని భారతీ రాజా పేర్కొన్నారు. ఇప్పటికే చాలా సినిమాలు సగంలోనే ఆగిపోయాయని.. వాటిని మళ్లీ మొదలు పెట్టాలంటే పరిశ్రమలో ఉన్న అందరు నిర్మాతలకు సహకరించాలని వెల్లడించారు. ప్రస్తుతం నిర్మాతలను కాపాడుకోకపోతే తమిళ పరిశ్రమ పూర్తిగా నష్టాలపాలవుతుందని భారతీ రాజా హెచ్చరించారు.

Read More:

ప్రభాస్ ‘రాధే శ్యామ్’‌.. ఇంట్రస్టింగ్ న్యూస్‌..!

కరోనా అప్‌డేట్స్‌: ప్రపంచవ్యాప్తంగా 4కోట్లు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య