హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా గతంలో నిర్మలా కాన్వెంట్ అనే సినిమా వచ్చింది. ఆ చిత్రం అనుకున్న మేర విజయం సాధించలేదు. అయితే ఆ సినిమాలో రోషన్ కనబర్చిన నటనకు మంచి మార్కులే పడ్డాయి. కాగా, ఇటీవలే దర్శక దిగ్గజం కే రాఘవేందర్రావు రోషన్ హీరోగా పెళ్లిసందడిని మళ్లీ తీస్తున్నట్లు ప్రకటించారు. ఆ ఫస్ట్ పోస్టర్లో రోషన్ స్టన్నింగ్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు. ఆ మేకోవర్ కోసం రోషన్ బాగానే కష్టపడినట్లు ఫిలీంనగర్ టాక్.
తాజా కబర్…
ఇన్నాళ్లు దర్శకుడు రాఘవేందర్ రావే పెళ్లి సందడికి దర్శకత్వం వహిస్తారని అనుకున్నారు. కానీ ఆయన కేవలం కథ, కథనం అందిస్తారని, సినిమా దర్శకత్వం తనికెళ్ల భరణి చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. తనికెళ్ల భరణి గతంలో మిథునం సినిమా తీసి విమర్శల ప్రశంసలు అందుకున్నారు. అందుకే పెళ్లి సందడి దర్శకత్వ బాధ్యతలు ఆయనకు ఇచ్చేందుకు రాఘవేందర్ రావు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హీరో శ్రీకాంత్ కెరీర్లో పెళ్లిసందడి బ్లాక్ బాస్టర్ ఫిలిం. మరి ఆయన కొడుక్కి కూడా అదే స్థాయి విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.