త్వరలో ప్రేక్షకుల ముందుకు బజార్ రౌడీ.. లాక్‌డౌన్ అనంతరం షూటింగ్‌లో పాల్గొన్న బర్నింగ్ స్టార్..

|

Nov 30, 2020 | 6:44 PM

హాస్య చిత్రాల కథానాయకుడు సంపూర్ణేశ్ బాబు మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశాడు. విభిన్న పంథాలో కామెడీ పండిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు.

త్వరలో ప్రేక్షకుల ముందుకు బజార్ రౌడీ.. లాక్‌డౌన్ అనంతరం షూటింగ్‌లో పాల్గొన్న బర్నింగ్ స్టార్..
Follow us on

హాస్య చిత్రాల కథానాయకుడు సంపూర్ణేశ్ బాబు మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశాడు. విభిన్న పంథాలో కామెడీ పండిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. డబుల్ మీనింగ్ పంచెస్‌తో కామెడీ చేస్తాడని కొన్ని విమర్శలు ఉన్నా అవేమి సంపూ పట్టించుకోలేదు. ఎవరి దారి వారిదన్నట్లు తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. హృదయ కాలేయం అనే చిన్న సినిమా ద్వారా హీరోగా పరిచమైన సంపూ అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. త్వరలోనే బజార్ రౌడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

లాక్‌డౌన్ స‌మ‌యంలో షూటింగ్స్ ఆగిపోవడంతో ఇంటి దగ్గరే ఉన్న సంపూర్ణేశ్ బాబు ఇటీవల షూటింగ్‌లో పాల్గొన్నాడు. బ‌జార్ రౌడీతో స్టెప్ప‌లేయించిన కొరియోగ్రాఫ‌ర్ ప్రేమ్ ర‌క్షిత్ అంటూ ట్విట‌ర్‌లో షూటింగ్ లొకేష‌న్ ఫొటోల‌ను బీఏ రాజు షేర్ చేశారు. బ్లాక్ అండ్ యెల్లో కాంబినేష‌న్ డ్రెస్ స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న సంపూ ప్రేమ్ ర‌క్షిత్ సూచ‌న‌లు వింటుండ‌టం స్టిల్స్‌లో చూడొచ్చు. మ‌రో వైపు బ్యాక్ డ్రాప్‌లో డ్యాన్స‌ర్ల బృందం కూడా కనిపిస్తోంది. ఈ ఫొటోలు ఇపుడు ఆన్ లైన్‌లో దుమ్ము దులుపుతున్నాయి. బజార్ రౌడీ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా సంపూర్ణేశ్ బాబుకు మంచి ఇమేజ్ తెచ్చిపెడుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ప్రకటించింది.