పవన్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌ చెప్పిన బండ్ల గణేష్‌

పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్‌ అభిమానులు మరో శుభవార్త. ఇప్పటికే నాలుగు సినిమాలకు ఓకే చెప్పిన పవన్‌.. అందులో రెండింటిని స్టార్ట్ చేశారు

పవన్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌ చెప్పిన బండ్ల గణేష్‌

Edited By:

Updated on: Sep 28, 2020 | 2:09 PM

Pawan Kalyan Bandla Ganesh: పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్‌ అభిమానులు మరో శుభవార్త. ఇప్పటికే నాలుగు సినిమాలకు ఓకే చెప్పిన పవన్‌.. అందులో రెండింటిని స్టార్ట్ చేశారు. ఇక ఇప్పుడు మరో మూవీని ఖరారు చేశారు. బండ్ల గణేష్ నిర్మాతగా పవన్ ఓ చిత్రంలో నటించనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. ”నా బాస్ మరోసారి ఓకే చెప్పాడు. నా కల నెరవేరింది. నా దేవుడికి థ్యాంక్యు” అని కామెంట్ పెట్టారు. ఈ సందర్భంగా పవన్‌తో తీసుకున్న ఫొటోను షేర్ చేశారు.

ఇక బండ్ల గణేష్‌ ట్వీట్‌తో పవన్ ఫ్యాన్స్‌ సంబరాలు జరుపుకుంటున్నారు. మరి ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించనున్నారు..? ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లనుంది..? వంటి ప్రశ్నలకు త్వరలోనే సమాధానం తెలియనుంది.

అయితే ఆంజనేయులుతో నిర్మాతగా మారిన బండ్ల గణేష్‌.. తన దేవుడిగా భావించే పవన్‌తో తీన్‌మార్‌, గబ్బర్ సింగ్ చిత్రాలను నిర్మించారు. అందులో తీన్‌మార్ పరాజయం అయినప్పటికీ.. గబ్బర్‌సింగ్‌ పెద్ద విజయం సాధించింది. ఇక ఈ కాంబోలో మరో చిత్రం వస్తుండటంతో ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగిపోయాయి.

Read More:

త్వరలో హిందీ, కన్నడ భాషల్లో ఎస్వీబీసీ ఛానెల్‌: వైవీ సుబ్బారెడ్డి

‘ఆచార్య’ కోసం చెర్రీ పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడా..!