చిరు డల్లాస్ టూర్, తెలంగాణ ప్రభుత్వంపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు..!

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

చిరు డల్లాస్ టూర్, తెలంగాణ ప్రభుత్వంపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు..!

Edited By:

Updated on: Jun 01, 2020 | 10:55 PM

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన ఆరోపణలు చేశారు. నాగబాబు తన గురించి చాలా మాట్లాడారని, కానీ వాటిపై తాను స్పందించాలనుకోవడం లేదని బాలకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా షూటింగ్‌లకు అనుమతులు లభించడంపై కూడా ఆయన మాట్లాడారు.

అత్యధికంగా పన్నులు కట్టే రంగాల్లో తమది కూడా ఒకటని, అందుకే సినిమా షూటింగ్‌లపై ప్రభుత్వం ఆసక్తిని చూపుతుందని బాలయ్య అన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నింటికి అనుగుణంగా షూటింగ్‌లు చేయడం కష్టమైన పనని ఆయన తెలిపారు.

అంతటితో ఆగకుండా.. ”సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం ఫేవర్‌గా ఉన్నట్లు చాలా మంది ఫీల్ అవుతుంటారు. కానీ రెండు ఎకరాలు కూడా తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి ఇవ్వలేదు. చిరంజీవి సహా మరికొందరు ఆ మధ్యన డల్లాస్‌కి వెళ్లి రూ.5 కోట్లు విరాళాలు సేకరించినట్లు చెప్పారు. కానీ ఎంత డబ్బులు వచ్చిందని మాకు ఇంతవరకు తెలీదు. అలాంటి వాటిలో తలదూర్చడం నాకు ఇష్టం ఉండదు” అని బాలయ్య అన్నారు.

కాగా కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో సినీ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వారి సమస్యలు, అలాగే షూటింగ్‌లు తిరిగి ప్రారంభించడంపై ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కొంతమంది సినీ ప్రముఖులు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి తలసానిని కలిశారు. ఆ మీటింగ్‌లపై బాలయ్య సంచలన ఆరోపణలు చేశారు.

ఆ మీటింగ్‌లకు తనను ఎవరూ పిలవలేదన్న ఆయన, భూములు పంచుకోవడం కోసం తలసానితో సమావేశం అయ్యారంటూ ఆరోపణలు చేశారు. ఈ సందర్బంగా పరుష పదజాలం కూడా వాడారు.  దీంతో రంగంలోకి దిగిన మెగా బ్రదర్ నాగబాబు, బాలయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా ఆ కామెంట్లపై బాలయ్య స్పందిస్తూ.. నాగబాబు వ్యాఖ్యలపై ఏం మాట్లాడనని అన్నారు. అయితే ఈ వివాదంపై మెగాస్టార్ చిరంజీవి ఇంకా స్పందించకపోవడం గమనర్హం.

Read This Story Also: విశాఖ మెట్రోలో మరో ముందుడుగు..!

Follow Us