Balagam Movie: బుల్లి తెరపై కూడా ‘బలగం’ బ్లాక్‌ బ్లస్టర్‌.. ఊహకందని టీఆర్‌పీతో టీవీల్లో సెన్సేషన్‌.

బలగం.. సగటు తెలుగు సినీ ప్రేక్షకుడికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుంది. కమెడియన్‌ వేణు తొలిసారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షమే కాకుండా ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. తెలంగాణ కుటంబాల మధ్య ఉండే బంధాలు, భావోద్వేగాలను..

Balagam Movie: బుల్లి తెరపై కూడా బలగం బ్లాక్‌ బ్లస్టర్‌.. ఊహకందని టీఆర్‌పీతో టీవీల్లో సెన్సేషన్‌.
Balgam Movie

Updated on: May 18, 2023 | 3:15 PM

బలగం.. సగటు తెలుగు సినీ ప్రేక్షకుడికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుంది. కమెడియన్‌ వేణు తొలిసారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షమే కాకుండా ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. తెలంగాణ కుటంబాల మధ్య ఉండే బంధాలు, భావోద్వేగాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు వేణు. థియేటర్లకు ప్రజలు ట్రాక్టర్లు, బస్సులు కట్టుకొని వచ్చారంటేనే ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా థియేటర్లలో షోలు నడిచాయి. అంతేనా గ్రామాల్లో ఏకంగా స్క్రీన్స్‌ను ఏర్పాటు చేసీ మరీ బలగం మూవీని ప్రజలకు చూపించారు. అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో దుమ్మురేపిన బలగం చిత్రం తాజాగా బుల్లి తెరపై కూడా సందడి చేసిన విషయం తెలిసిందే. స్టార్‌ మాలో టెలికాస్ట్‌ అయిన ఈ సినిమా రికార్డు టీఆర్సీని సాధించింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేసిన బలగం సినిమాకు ఏకంగా 14.3 టీఆర్పీ వచ్చింది. ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో టీఆర్పీ సాధించిన మూవీగా బలగం నిలిచింది. హైదరాబాద్ సెగ్మెంట్ లోనైతే ఏకంగా 22 రేటింగ్ తో సంచలనం సృష్టించింది బలగం మూవీ.

బలగం మూవీ ప్రేక్షకులను ఎంతలా మెప్పించిందో చెప్పడానికి ఇవన్నీ ప్రత్యక్ష సాక్ష్యాలు. చావు చుట్టూ సినిమా మొత్తాన్ని నడిపించిన దర్శకుడు ప్రేక్షకులకు ఏమాత్రం బోర్‌ కొట్టకుండా, ఆద్యంతం కట్టిపడేసేలా తెరకెక్కించిన విధానాన్ని ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలో కాస్టింగ్ విషయానికొస్తే.. ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ జంటగా నటించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..