Warner Dance: పుష్ప.. పుష్ప ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు మారుమోగుతోంది. నేషనల్ వైడ్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ ముందు సంచలన విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ఇందులోని పాటలు కూడా అదే స్థాయిలో విజయవంతమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా యూత్ పుష్ప పాటలకు రీల్స్‌తో హోరెత్తిస్తున్నారు. అయితే పుష్ప క్రేజ్ భాషలే కాకుండా దేశాలను సైతం దాటేసింది. ఇప్పటికే ఇతర దేశాలకు చెందిన కొందరు పుష్ప పాటలకు స్టెప్పులు వేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
తాజాగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు కూడా ఈ జాబితాలోకి చేరాడు. ఇప్పటికే తెలుగు సినిమాలకు చెందిన చాలా డైలాగ్‌లు, పాటలను రీల్స్ రూపంలో చేస్తూ సోషల్ మీడియాలో ఎక్కడ లేని క్రేజ్‌ను సంపాదించుకున్న వార్నర్ తాజాగా పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు కాలు కదిపి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. పుష్ప రాజ్ మేనరిజాన్ని అచ్చుగుద్దినట్లు దింపేసి నెటిజన్లను షాక్‌కి గురి చేశాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోతో పాటు పుష్ప హాష్ ట్యాగ్‌ను పోస్ట్ చేస్తూ.. తర్వాత ఏంటి అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు వార్నర్. ఇదిలా ఉంటే వార్నర్ పుష్ప చిత్రంపై రీల్స్ చేయడం ఇదే తొలిసారి కాదు గతంలో ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా పాటకు డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే.
Also Read: Health Tips: డిప్రెషన్‌తో బాధపడుతున్నారా.. ఖచ్చితంగా ఈ 3 పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాల్సిందే..!
Hyderabad: తీవ్ర విషాదం.. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి ఆత్మహత్య