పదేళ్ల తరువాత బన్నీకి విలన్‌గా మరోసారి ఆ హీరో.. క్రేజీ కాంబో సెట్‌ అయినట్లేనా!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో చిత్రం పుష్ప. లాక్‌డౌన్ తరువాత ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభమైంది

పదేళ్ల తరువాత బన్నీకి విలన్‌గా మరోసారి ఆ హీరో.. క్రేజీ కాంబో సెట్‌ అయినట్లేనా!
Follow us

| Edited By:

Updated on: Nov 12, 2020 | 8:53 PM

Allu Arjun Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో చిత్రం పుష్ప. లాక్‌డౌన్ తరువాత ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభమైంది. ప్రధాన తారాగణం మొత్తం ఇందులో పాల్గొంటుంది. ఇక కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తలను తీసుకుంటూ షూటింగ్‌ని జరిపిస్తున్నారు దర్శకుడు సుకుమార్. (‘ఓం జై జగదీశ్‌ హరే’ పాట పాడిన ప్రముఖ అమెరికన్ సింగర్‌.. వీడియో రిలీజ్‌)

కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీలో మొదట విలన్‌గా కోలీవుడ్‌ నటుడు విజయ్ సేతుపతిని తీసుకున్నారు. కానీ డేట్లు క్లాష్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్‌ నుంచి అతడు తప్పుకున్నారు. ఇక ఆ తరువాత ఈ పాత్ర కోసం బాలీవుడ్‌ నటుడిని అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ పాత్ర కోసం కోలీవుడ్‌ నటుడు ఆర్యతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అతడితో మాటలు నడుస్తున్నాయని, ఇందులో నటించేందుకు ఆర్య కూడా ఆసక్తిని చూపుతున్నారని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఈ జోడీని మరోసారి తెరపై చూసే అవకాశం వస్తుంది. 2010లో బన్నీ హీరోగా నటించిన వరుడులో ఆర్య విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఊహించినంత విజయం సాధించనప్పటికీ.. ఈ ఇద్దరి కాంబోకు మంచి పేరొచ్చింది. ఇక ఇప్పుడు మళ్లీ అదే క్రేజీ కాంబో సెట్ అవుతుందేమో చూడాలి.(డ్రగ్స్ కేసు: ఆ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం)

ఇదిలా ఉంటే పుష్పలో బన్నీ పాత్రపై పలు రకాల వార్తలు వస్తున్నాయి. కూలీ నుంచి ఎర్ర చందనం స్మగ్లర్‌గా బన్నీ మారనున్నాడని, ఈ పాత్ర కోసం బన్నీ కూడా రీసెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో బన్నీ సరసన రష్మిక మొదటిసారి జత కట్టబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రాబోతున్న ఈ మూవీపై అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. (మన చుట్టూ ఎంత కఠినాత్ములు ఉంటారంటే: తమన్నా భావోద్వేగం)

Latest Articles
ఈ ఫుడ్స్ పిల్లలకు పెట్టారంటే.. బ్రెయిన్ షార్ప్‌గా పని చేస్తుంది..
ఈ ఫుడ్స్ పిల్లలకు పెట్టారంటే.. బ్రెయిన్ షార్ప్‌గా పని చేస్తుంది..
ఆ పెట్టుబడి పథకంతో అదిరే లాభాలు.. ఎఫ్‌డీ కంటే సూపర్ రిటర్న్స్
ఆ పెట్టుబడి పథకంతో అదిరే లాభాలు.. ఎఫ్‌డీ కంటే సూపర్ రిటర్న్స్
ఎప్పుడూ నిద్ర మత్తుగా ఉంటుందా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
ఎప్పుడూ నిద్ర మత్తుగా ఉంటుందా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
తారక్ పుట్టిన రోజున అదిరిపోయే అప్డేట్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
తారక్ పుట్టిన రోజున అదిరిపోయే అప్డేట్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
మరో సరికొత్త రికార్డులో కింగ్ కోహ్లీ.. తొలి టీమిండియా ప్లేయర్‌గా
మరో సరికొత్త రికార్డులో కింగ్ కోహ్లీ.. తొలి టీమిండియా ప్లేయర్‌గా
తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రచారంలో మలయాళ నటుడు..
తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రచారంలో మలయాళ నటుడు..
బజాజ్ పల్సర్ 125 రిలీజ్ చేశారోచ్చ్… ఆ బైక్‌లకు గట్టి పోటీ
బజాజ్ పల్సర్ 125 రిలీజ్ చేశారోచ్చ్… ఆ బైక్‌లకు గట్టి పోటీ
మైలేజ్ ఆలోచించే కారు కొంటున్నారా..? ఆ కార్లల్లో ప్రధాన తేడాలివే.!
మైలేజ్ ఆలోచించే కారు కొంటున్నారా..? ఆ కార్లల్లో ప్రధాన తేడాలివే.!
పాకిస్థానీయులకు వైద్య సహాయం అందించిన భారత నావీ
పాకిస్థానీయులకు వైద్య సహాయం అందించిన భారత నావీ
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయపడిన రోహిత్..
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయపడిన రోహిత్..