Arnab Chats Leaked: ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తున్న అర్నబ్ చాట్స్..కంగనా, హృతిక్ రిలేషన్‌పై సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ న్యూస్ యాంకర్ అర్నాబ్ గోస్వామి మళ్ళీ వార్తల్లో నిలిచారు. తాజాగా అర్నబ్ మాజీ బార్క్ సీఈవో దాస్ గుప్తా లమధ్య జరిగిన వాట్సప్ సంభాషణ లీక్ అయింది. వీరిద్దరి మధ్య 500 పేజీల చాట్ ప్రస్తుతం ఆన్ లైన్‌లో సంచలనం..

Arnab Chats Leaked: ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తున్న అర్నబ్ చాట్స్..కంగనా, హృతిక్ రిలేషన్‌పై సంచలన వ్యాఖ్యలు

Updated on: Jan 18, 2021 | 5:23 PM

Arnab  Chats Leaked: ప్రముఖ న్యూస్ యాంకర్ అర్నాబ్ గోస్వామి మళ్ళీ వార్తల్లో నిలిచారు. తాజాగా అర్నబ్ మాజీ బార్క్ సీఈవో దాస్ గుప్తా లమధ్య జరిగిన వాట్సప్ సంభాషణ లీక్ అయింది. వీరిద్దరి మధ్య 500 పేజీల చాట్ ప్రస్తుతం ఆన్ లైన్‌లో సంచలనం సృష్టిస్తుంది. 2017 ఏడాదిలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, ఫైర్ బ్రాండ్ క్వీన్ కంగనాల రిలేషన్‌పై వీరిద్దరి మధ్య ప్రస్తావన వచ్చినట్లు స్నాప్‌షాట్ ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా వీరిద్దరి రిలేషన్ గురించి అర్నబ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

కంగనా రనౌత్‌కు హృతిక్ రోషన్‌తో లైంగిక సంబంధం ఉందని అర్నాబ్ ఆరోపించారు. వీరిద్దరి రిలేషన్ వివాదాస్పదంగా ముసిగిందని చెప్పారు. ముఖ్యంగా ఓ సందర్భంలో అర్నాబ్ గోస్వామి హృతిక్ రోషన్‌ను ఇంటర్వ్యూ చేసినప్పుడు కంగనా ఆరోపణలు గురించి హృతిక్ బహిరంగంగా స్పందించాడు. అప్పటి నుంచి అర్నబ్ తన వాట్సాప్‌లో వేరే వ్యక్తితో కంగనా క్యారెక్టర్ గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. హృతిక్ నెమ్మదస్తుడు.. అయితే కంగనాకు మానసిక స్థిరత్వం లేదని.. ఆమెకు అనుమానం ఎక్కువని అన్నారు. అంతేకాదు కంగనాహృతిక్‌ల మధ్య శారీరక సంబంధం ఉందని.. కంగనా ఈ విషయంలో ఆరోపణలు చేసిన సమయంలో హృతిక్ మౌనంగా ఉన్నారని నిజానికి కంగనా గీత దాటిందని అర్నబ్ సంచలన కామెంట్స్ చేశారు. మరి ఈ విషయంపై ఫైర్ బ్రాండ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

Also Read: ఏపీ స్కూళ్లలో టాయిలెట్స్‌ నిర్వహణ, విద్యార్థుల హాజరు కోసం మొబైల్‌ యాప్‌

Loading...
Unable to load recommendations.
Follow Us