
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ప్రస్తుతం ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి పాత్రను పోషిస్తుండగా.. ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 21వ తేదీన విడుదల కానున్నట్లు తన అధికారక ట్విట్టర్ ద్వారా హీరో షాహిద్ కపూర్ తెలియజేశాడు.
కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై అక్కడ భారీ అంచనాలే నెలకొన్నాయి. గుల్షన్ కుమార్, సినీ వన్ స్టూడియోస్ కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.