మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అక్టోబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ మూవీ చిత్రీకరణలో తాజాగా భాగం అయింది యోగా బ్యూటీ అనుష్క.
ఇందులో నరసింహారెడ్డి జీవిత చరిత్రను తెలిపే నేరేటర్(వ్యాఖ్యాత) పాత్రను అనుష్క పోషించనుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కాబోతోన్న ఈ మూవీలో నేరేటర్ పాత్రకు అనుష్క కరెక్ట్ ఛాయిస్ అని భావించిన టీం.. ఆమెను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అలాగే చిత్రంలో పాత్ర చిన్నదైనా.. ఇందుకోసం అనుష్కకు భారీ పారితోషికం ముట్టినట్లు సమాచారం. కాగా ఈ మూవీలో చిరు సరసన నయనతార నటిస్తుండగా.. అమితాబ్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్ నటిస్తోన్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.