బిడ్డను ప్రసవించిన తర్వాత తిరిగి సినిమాలు చేస్తానంటున్న అనుష్క శర్మ.. నటనే నిజమైన హ్యాపీనెస్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ 

|

Nov 29, 2020 | 10:41 AM

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మా పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. విరాట్ కోహ్లీని పెళ్లాడిన తర్వాత ఈ అమ్మడు కెమెరా ముందుకు రాలేదు. సోషల్ మీడియాలో అనుష్క చాలా యాక్టివ్ గా ఉంటుంది...

బిడ్డను ప్రసవించిన తర్వాత తిరిగి సినిమాలు చేస్తానంటున్న అనుష్క శర్మ.. నటనే నిజమైన హ్యాపీనెస్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ 
Follow us on

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మా పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. విరాట్ కోహ్లీని పెళ్లాడిన తర్వాత ఈ అనుష్క కెమెరా ముందుకు రాలేదు. అయితే సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల అనుష్క గర్భందాల్చిన విషయం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది అనుష్క. అనుష్కా బేబి బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ తిరిగి షూటింగ్స్ లో బిజీ అవ్వడానికి సిద్ధం అవుతుంది. జనవరిలో డెలివరీ అవ్వగానే తిరిగి కెమెరా ముందుకు రాబోతుంది అనుష్క. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ..“నేను నా బిడ్డను ప్రసవించిన తర్వాత నేను నా సినిమాల్లోకి  తిరిగి వస్తాను. పిల్లలు..ఇల్లు..వృత్తి ఇదే ముఖ్యం. నేను జీవించినంత కాలం పని చేస్తూనే ఉండాలని అనుకుంటున్నాను. నటన నిజంగా నాకు సంతోషాన్ని ఇస్తుంది”. అని అనుష్క చెప్పుకొచ్చింది. మరో వైపు అనుష్కను తిరిగి సినిమాల్లో చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అమిత్ షా హైదరాబాద్ టూర్ లైవ్ అప్ డేట్స్ కోసం దిగువ లింక్ ను క్లిక్ చేయండి.