Hari Teja Home Tour: యాంకర్‌ హరితేజ ఇల్లు ఎలా ఉందో చూశారా.? పేపర్‌ కటింగ్స్‌ను ఎంత అపురూపంగా దాచుకుందో..

Hari Teja Home Tour: సినీ సెలబ్రెటీలు ఇటీవల ఫ్యాన్స్‌తో ఇంట్రాక్ట్‌ అవ్వడం బాగా పెరిగింది. ముఖ్యంగా సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత..

Hari Teja Home Tour: యాంకర్‌ హరితేజ ఇల్లు ఎలా ఉందో చూశారా.? పేపర్‌ కటింగ్స్‌ను ఎంత అపురూపంగా దాచుకుందో..

Edited By:

Updated on: Oct 05, 2021 | 7:17 PM

Hari Teja Home Tour: సినీ సెలబ్రెటీలు ఇటీవల ఫ్యాన్స్‌తో ఇంట్రాక్ట్‌ అవ్వడం బాగా పెరిగింది. ముఖ్యంగా సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అందరూ ఫ్యాన్స్‌తో నేరుగా మాట్లాడుతున్నారు. ఇక కొందరు సెలబ్రిటీలు యూట్యూబ్‌ చానల్స్‌ను ప్రారంభించి రకరకాల వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోల్లో తమ అభిరుచులను, టూర్‌లకు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ‘హోమ్‌ టూర్‌’ పేరుతో కొత్త రకం వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు. తమ ఇంటి మొత్తాన్ని అభిమానులకు చూపిస్తూ వీడియోలు తీస్తున్నారు. ఇటీవల ఆలీ భార్యతో పాటు పలువురు సెలబ్రిటీలు ఇలాంటి వీడియోలు పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా యాంకర్, నటి, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌.. హరితేజ కూడా తమ ఇంటిని అభిమానులకు చూపించారు. హరి కథలు పేరుతో యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించిన హరితేజ కొత్త కొత్త వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. తన ఇంటిని అభిమానులకు చూపించిన హరితేజ తాను ఎంతో ఇష్టపడి చేయించుకున్న ఇంటిరీయర్‌ డిజైన్స్‌తో పాటు, తన పాప కోసం చేసిన ఏర్పాట్లు ఇలా అన్నింటినీ చూపించారు. ఇక తన చిన్నారి కోసం ప్రతీ గదిలో హరితేజ ఒక ఉయ్యాలు ఏర్పాటు చేయడం విశేషం.

అంతేకాకుండా చిన్ననాటి నుంచి హరితేజ డ్యాన్స్‌ పర్‌ఫామెన్స్‌కు సంబంధించిన వార్త పత్రికల్లో పబ్లిష్‌ అయిన క్లిప్పింగ్స్‌ను కట్‌ చేసి భద్రంగా దాచుకున్న జ్ఞాపకాలను హరితేజ చూపించారు. ఇక తన ఇంటిలో హరితేజకు అత్యంత ఇష్టమైన ప్రదేశం వంట గది అని చెప్పుకొచ్చారు. హరితేజ ఇల్లు ఎలా ఉందో మీరూ చూసేయండి మరి..

Also Read: Knee Pain-Home Tips: కీళ్లు, మోకాళ్ళు, వెన్నె నొప్పితో బాధపడుతున్నారా 15 రోజులు ఈ టీ తాగిచూడండి.. రిలీఫ్ పొందండి

Bigg Boss 5 Telugu: అతి చేసిన కాజల్.. మాట మారుస్తున్నావంటూ రవి సీరియస్… ఇద్దరూ ఎక్కడ తగ్గలేదుగా..

CM KCR On Dalithabandhu: దళితబంధుపై సీఎం కీలక ప్రకటన.. వచ్చే మార్చిలోపు 100 నియోజకవర్గాల్లో దళితబంధు..