Anasuya: వాళ్లు వికారమైన జీవులు, దూరంగా ఉండడం మంచిది: అనసూయ

|

Jan 08, 2024 | 7:40 AM

గతంలో నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచిన అనసూయ గత కొన్ని రోజులుగా సైలెంట్‌ అయ్యింది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసుకుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సమయంలో అభిమానులు..

Anasuya: వాళ్లు వికారమైన జీవులు, దూరంగా ఉండడం మంచిది: అనసూయ
Anasuya
Follow us on

అనసూయ.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఒక న్యూస్‌ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ, టీవీ యాంకర్‌గా, సినీ తారగా పేరు సంపాదించుకుంది. తనదైన అందం, నటనతో సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. ఇక సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అనసూయ నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారుతుంది.

గతంలో నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచిన అనసూయ గత కొన్ని రోజులుగా సైలెంట్‌ అయ్యింది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసుకుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సమయంలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది.

‘టీవీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు’.? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిచ్చి అనసూయ.. ‘యాంకరింగ్‌ నా కెరీర్‌కు ఎంతో ఉపయోగపడింది.. కరోనా సమయంలోనూ పలు కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించాను. కానీ ఇప్పుడు కాస్త బ్రేక్‌ కావాలనిపించిందని అందుకే టెలివిజన్‌ నుంచి కొన్ని రోజులు విరామం తీసుకున్నాను’ అని చెప్పుకొచ్చింది. ఇక.. ‘మిమ్మల్ని ట్రోల్‌ చేసేవారికి ఏం చెప్పాలనుకుంటున్నారు?’ అన్న ప్రశ్నకు ఘాటుగానే బదులిచ్చింది.

అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్..

ఈ విషయమై అనసూయ మాట్లాడుతూ.. ‘ట్రోలర్స్‌ అంటే వికారమైన జీవులు. వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని తెలుసుకున్నా. వాళ్లకు ఏదో ఒకటి చెప్పి టైమ్‌ వేస్ట్‌ చేసుకోవాలనుకోవడం లేదు’ అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ‘తెలుగు వారు అయ్యుండి. ఇంగ్లిష్‌లో ఎందుకు మాట్లాడుతున్నారు?’ అనగా.. ‘ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో చదువుకోవడం.. ఉత్తరాదికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల ఇంగ్లిష్‌లో మాట్లాడటం అలవాటైంది. ఇంట్లో ఎక్కువగా హిందీ, ఇంగ్లిష్‌లోనే మాట్లాడుకుంటాం. ఇంగ్లిష్‌ అనేది యూనివర్సల్‌ లాంగ్వేజ్‌’ అని బదులిచ్చింది.

అనసూయ లేటెస్ట్‌ ఫొటోలు..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.