బుల్లితెర యాంకర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అంతులేని అభిమానులను.. తనకంటూ ఓక్రేజ్‌ను.. సంపాదించుకుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో అనసూయ తీరే వేరు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. సినిమాలతోనూ బిజీబిజీగా ఉంటోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత.. అనసూయ పాటిస్తుందని.. చాలా ఇంటర్య్వూల్లో తెలిపింది. తాజాగా ఆమె ‘కథనం’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. కాగా.. ఇవాళ అనసూయ భరద్వాజ్ పుట్టినరోజు సందర్భంగా.. ఈ సినిమాలోని కొన్ని ఫొటోలను రిలీజ్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది చిత్ర యూనిట్. ఇటీవలే ఈ సినిమా మోషన్ టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు.
#KathanamTeam Wishing Beautiful actress @anusuyakhasba a very Happy Birthday#HBDAnasuyaBhardwaj
Coming Soon!#AvarasaralaSrinivas, @DhanrajOffl @vennelakishore #BattepatiNarendraReddy #RajeshNadendla @RoshanSalur #SharmaChukka#Kathanam pic.twitter.com/TeVNR2Vevz
— BARaju (@baraju_SuperHit) May 15, 2019