
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నటుడిగా మారుతున్న విషయం తెలిసిందే. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘కోబ్రా’లో వర్మ ఒక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మేరకు తన పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రకటనను విడుదల చేస్తూ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశాడు వర్మ.
ఇదిలా ఉంటే నటుడిగా వర్మ ఎంట్రీపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘ఎట్టకేలకు సర్కారు అసలైన వృత్తిని ఎంచుకున్నాడు. ఆల్ ది బెస్ట్ సర్కార్. నాకు మరో కాంపిటీటర్’’ అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. కాగా ఈ చిత్రంలో వర్మ ఇంటలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.
T 3136 – FINALLY .. !! Ram Gopal Varma .. the 'SARKAR' finds his true vocation .. ACTING !! All the best Sircaarrrrr .. ???
DAMN .. another competition !!?? pic.twitter.com/5sFDCB8NnD— Amitabh Bachchan (@SrBachchan) April 8, 2019