Ameesha Patel : అమీషా పటేల్ ఈ అమ్మడు అందరికి గుర్తుండే ఉంటుంది. తెలుగులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ. ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉంటున్న అమీషా. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా అమీషా పటేల్‌ను హ్యాకర్లు టార్గెట్ చేసారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మంగళవారం హ్యాక్‌కు గురైంది. ఖాతాలో ఉన్న సమాచారం కనిపించడం లేదంటూ అమీషా పటేల్ ముంబై సైబర్ సెల్‌లో ఫిర్యాదు చేశారు. తనకు వచ్చిన లింక్‌ను క్లిక్ చేయగా మరో నకిలీ సైట్‌కు చేరుతున్నదని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో రంగంలోకి దిగిన సైబర్ సెల్ పోలీసులు.. ఇన్‌స్టాగ్రామ్ హ్యాకింగ్ ను గుర్తించి తిరిగి తన ఖాతాను తీసుకు వచ్చారు. ఫోటోలు, సమాచారం అంతా పునరుద్ధరించారు. కాగా హ్యాకింగ్‌కు గురైన సమాచారం నెదర్లాండ్స్ నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ లింక్ నెదర్లాండ్స్ యూఆర్‌ఎల్ నుంచి రాగా.. ఐపీ చిరునామా ప్రదేశం టర్కీలో ఉన్నట్లు కనుగొన్నారు.