Allu Arjun: మరో ఘనత సాధించిన ‘స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ .. ఈ దెబ్బతో సెలబ్రిటీలను సైతం వెనక్కి నెట్టారు..

Allu Arjun: టాలీవుడ్‌లో ‘స్టైలిష్‌ స్టార్‌’ అల్లు అర్జున్‌కు ఉండే క్రేజే వేరు. తన నటనతో అభిమానులను బీభత్సంగా అలరిస్తారు. డిఫరెంట్

Allu Arjun: మరో ఘనత సాధించిన ‘స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ .. ఈ దెబ్బతో  సెలబ్రిటీలను సైతం వెనక్కి నెట్టారు..

Edited By:

Updated on: Jan 07, 2021 | 6:57 PM

Allu Arjun: టాలీవుడ్‌లో ‘స్టైలిష్‌ స్టార్‌’ అల్లు అర్జున్‌కు ఉండే క్రేజే వేరు. తన నటనతో అభిమానులను బీభత్సంగా అలరిస్తారు. డిఫరెంట్ పంథాలో డైలాగులు చెబుతూ హుషారెత్తిస్తారు. ఇక డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ హీరోలలోని బెస్ట్ డ్యాన్సర్‌లలో అల్లు అర్జున్ ముందు వరసులో ఉంటారు. ఇందులో ఏ మాత్రం ఆలోచించనవసరం లేదు. గతేడాది సంక్రాంతికి అలా వైకుంఠపురం సినిమాతో బాక్సాఫీసును షేక్ చేశారు. ఈ సినిమా చాలా రికార్డులను బద్దలు కొట్టింది. బన్నీకి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. తాజాగా బన్నీ మరో ఘనతను సాధించాడు.

సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన హీరోగా గుర్తింపు సాధించాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీ ఫాలోవర్స్‌ సంఖ్య 10మిలియన్లకు చేరింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌, సినీ ప్రముఖులు సోషల్‌ మీడియాలో ఆయనకు అభినందనలు చెబుతున్నారు. అలాగే బన్నీకి ట్విటర్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ల్లోనూ ఫాలోవర్స్‌ సంఖ్య మిలియన్లలోనే ఉంది. ట్విటర్‌లో ప్రస్తుతం 5.5 మిలియన్ల మంది నెటిజన్లు ఆయన్ను ఫాలో అవుతున్నారు. ఫేస్‌బుక్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 13 మిలియన్లకు పైమాటే. అల్లుఅర్జున్‌ యూట్యూబ్‌ ఛానెల్‌కు 7 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నారు.

Payal With Satyadev: సత్యదేవ్‌తో జతకట్టనున్న ‘ఆర్‌ఎక్స్‌100’ బ్యూటీ… త్వరలోనే అధికారిక ప్రకటన.?

అడవుల్లో పుష్పరాజ్‌.. మాసిపోయిన షర్ట్‌, ఫ్యాంట్‌తో కేక పెట్టిస్తోన్న బన్నీ లుక్‌.. చూశారా..!