వలస కార్మికుల నడక కష్టాలు.. ముందుకొచ్చిన అల్లు అరవింద్..!

కరోనా వేళ అన్ని ప్రభుత్వాలు ఆర్థికంగా ఎంతో చితికిపోయాయి. ఈ క్రమంలో వారిని మద్దతుగా సినిమా సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు.

వలస కార్మికుల నడక కష్టాలు.. ముందుకొచ్చిన అల్లు అరవింద్..!

Updated on: May 21, 2020 | 9:58 PM

కరోనా వేళ అన్ని ప్రభుత్వాలు ఆర్థికంగా ఎంతో చితికిపోయాయి. ఈ క్రమంలో వారిని మద్దతుగా సినిమా సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. తమ తరఫున విరాళాలు ఇవ్వడంతో పాటు పలు విధాలుగా సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అరవింద్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో మొన్నటికి వరకు వలస కార్మికులు వేరే వేరు రాష్ట్రాల్లో చిక్కుకోగా.. ఇటీవలే తమ సొంత గ్రామాలను పయనమవుతున్నారు. వీరి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది. అయితే వాహనాల్లో వెళ్లేందుకు డబ్బులు కూడా లేని చాలా మంది వలస కార్మికులు.. తమ కాళ్లకు చక్రాలు కట్టుకొని ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఈ క్రమంలో వారు పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు. అందులోనూ ఎండాకాలం కావడంతో ఎంతో మంది అలసి సొలసి తమ ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. వారి పరిస్థితి చూసి చాలా మంది చలించిపోతున్నారు. ఈ నేపథ్యంలో వారి కోసం సహాయం చేసేందుకు కొందరు ముందుకొస్తున్నారు. వలస కార్మికులకు పలుచోట్ల నీళ్లు, ఆహారం, చెప్పులు లాంటివి అందిస్తున్నారు. ఇందులో భాగంగా వారి కోసం ఓ ఎన్జీవో సహాయం చేస్తుండగా.. అందుకోసం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ డబ్బులు విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించిన ఆయన చిన్న తనయుడు అల్లు శిరీష్‌.. వలస కార్మికుల కోసం సహాయం చేసేందుకు ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు లింక్‌ని కూడా ఆయన ఆ ట్వీట్‌లో పెట్టారు.

Read This Story Also: కరోనా కాలం.. ఉగ్రవాదిని భారత్‌కి పంపనున్న అమెరికా..!

Loading...
Unable to load recommendations.
Follow Us