
టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘నాంది’. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ కాస్తా సీరియస్ లుక్లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. జైలు బ్యాక్ డ్రాప్లో ఉండనున్న ఈ మూవీని దర్శకుడు సతీష్ విగ్నేష్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లో నరేష్ పోలీస్ స్టేషన్లో నగ్నంగా కూర్చోని ఉన్నాడు. దీంతో అల్లరి నరేష్ నుంచి థ్రిల్లర్ మూవీ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఈనెల 19న విడుదల కానుంది. ఈ మూవీ ప్రచారంలో భాగంగా.. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని ఆ కార్యక్రమాన్ని tv9లో లైవ్లో వీక్షించండి.