థ్యాంక్యూ రాజమౌళి సర్: అలియాభట్

| Edited By: Pardhasaradhi Peri

Mar 14, 2019 | 5:24 PM

ప్రతిష్టాత్మక సినిమా బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా డైరెక్టర్ రాజమౌళి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా తరువాత అదే తరహాలో రాంచరణ్, ఎన్టీఆర్‌లతో మరో చిత్రం నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో రాంచరణ్‌కు జోడీగా బాలీవుడ్ అందాలభామ అలియా భట్ నటించబోతున్నట్లు ఫైనల్ చేశారు. ఈ సందర్భంగా తనకు సినిమాలో అవకాశం ఇచ్చినందుకు ట్విట్టర్ వేదికగా అలియా భట్ స్వీట్ చేసింది. ‘‘థ్యాంక్యూ రాజమౌళి సర్, మీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర కాబోతున్నా.. చాలా ఆనందగా ఫీలవుతున్నా.. అలాగే […]

థ్యాంక్యూ రాజమౌళి సర్: అలియాభట్
Follow us on

ప్రతిష్టాత్మక సినిమా బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా డైరెక్టర్ రాజమౌళి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా తరువాత అదే తరహాలో రాంచరణ్, ఎన్టీఆర్‌లతో మరో చిత్రం నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో రాంచరణ్‌కు జోడీగా బాలీవుడ్ అందాలభామ అలియా భట్ నటించబోతున్నట్లు ఫైనల్ చేశారు. ఈ సందర్భంగా తనకు సినిమాలో అవకాశం ఇచ్చినందుకు ట్విట్టర్ వేదికగా అలియా భట్ స్వీట్ చేసింది. ‘‘థ్యాంక్యూ రాజమౌళి సర్, మీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర కాబోతున్నా.. చాలా ఆనందగా ఫీలవుతున్నా.. అలాగే చాలా ఎగ్జైట్ గా ఉన్నా.. మన సినిమా ప్రయాణం ఎప్పుడు మొదలవుతుందోనని.. అద్బుతమైన నటులతో ఎప్పుడు అందమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తానో అని.. ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’’ అని ట్వీట్ చేశారు. అలియా ట్వీట్‌కు రాజమౌళి రిప్లై ఇస్తూ.. తోటి నటులతో పోటీపడటానికి అంచనాలు పెంచేస్తూ ఎంతో కష్టపడతానని విన్నాను. ఇప్పుడు అదే నిబద్ధతను ఈ సినిమాలో చూపించబోతున్నందుకు సంతోషంగా ఉందంటూ తెలిపారు.