‘బంగార్రాజు’ సెట్స్ పైకి వెళ్ళేదెప్పుడంటే..!

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 2:17 PM

2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్న సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయన’. ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీక్వెల్ గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ సీక్వెల్ స్క్రిప్ట్ కు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడట. ఈ సినిమా జూన్ లో సెట్స్ మీదకు […]

బంగార్రాజు సెట్స్ పైకి వెళ్ళేదెప్పుడంటే..!
Follow us on

2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్న సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయన’. ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీక్వెల్ గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ సీక్వెల్ స్క్రిప్ట్ కు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడట. ఈ సినిమా జూన్ లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిలో నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తాడట. ఏది ఏమైనా ఈ విషయంపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

మరోవైపు ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున తన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ మీద నిర్మించనున్నాడట. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.