HBD Ajith Kumar: ఆ స్పెషల్ ఉంగరమంటేనే ఇష్టమంటోన్న అజిత్.. మరెన్నో ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..

|

May 01, 2022 | 5:59 AM

19 ఏళ్ల వయసులో ఈ సౌత్ సూపర్ స్టార్ ఓ తమిళ సినిమాలో సైడ్ రోల్ తో తన సినీ కెరీర్ ను ప్రారంభించాడు. తమిళంలో 60కి పైగా సినిమాలు చేశాడు. తమిళంలో శ్రీదేవి(Sridevi)తో కలిసి 'ఇంగ్లీష్ వింగ్లీష్' సినిమాకి పనిచేశారు.

HBD Ajith Kumar: ఆ స్పెషల్ ఉంగరమంటేనే ఇష్టమంటోన్న అజిత్.. మరెన్నో ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..
Happy Birthday Ajith Kumar
Follow us on

తమిళ సినీ ప్రముఖ నటుల్లో నటుడు అజిత్ కుమార్(Ajith Kumar) ఒకరు. ఈరోజు ఆయన 51వ పుట్టినరోజు. 19 ఏళ్ల వయసులో ఈ సౌత్ సూపర్ స్టార్ ఓ తమిళ సినిమాలో సైడ్ రోల్ తో తన సినీ కెరీర్ ను ప్రారంభించాడు. తమిళంలో 60కి పైగా సినిమాలు చేశాడు. తమిళంలో శ్రీదేవి(Sridevi)తో కలిసి ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాకి పనిచేశారు. అజిత్ కుమార్‌కు దక్షిణ భారత చిత్రాలకు దాదాసాహెబ్ ఫాల్కే (Dadasaheb Phalke Awards)అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డుతో పాటు, అతను మూడుసార్లు సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. పుట్టినరోజు సందర్భంగా అజిత్ గురించి మీరు ఇప్పటివరకు వినని కొన్ని విషయాలు తెలుసుకుందాం.

తన భార్య బహుమతిగా ఇచ్చిన ఉంగరాన్ని మాత్రమే ధరిస్తాడు..

అజిత్‌కు బంగారం అంటే ఇష్టం ఉండదు. నగలు లేదా ఇతర ఉపకరణాలు ధరించడం అతనికి అస్సలు ఇష్టం ఉండదు. అతను ఎప్పుడూ ఉంగరం తప్ప వేరే వాటిని ధరించకపోవడానికి ఇదే కారణం. అవును, అజిత్ తన భార్య షాలిని బహుమతిగా ఇచ్చిన ఉంగరం మాత్రమే ధరిస్తాడు. అది మనం ఎల్లప్పుడూ అజిత్ చేతికి చూడవచ్చు.

ఫార్ములా 2 రేసర్..

అజిత్ కుమార్‌కు నగలు అంటే ఇష్టం లేకపోయినా, రేసింగ్‌లంటే చాలా ఇష్టం ఉంటుంది. అయన స్వయంగా ఫార్ములా 2 రేసర్. అనేక జాతీయ, అంతర్జాతీయ రేసింగ్ పోటీలలో పాల్గొన్నాడు.

పైలట్..

అజిత్ కుమార్ ఫార్ములా రేసింగ్‌తో పాటు ఏరో మోడలింగ్‌పై కూడా ఆసక్తి చూపిస్తుంటాడు. ఇది హాబీగా చేస్తుంటాడు. పైలట్ లైసెన్స్ కూడా కలిగి ఉన్నాడు.

ఫోటోగ్రాఫర్..

అజిత్‌కి ఫోటోలు క్లిక్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్లినా తన కెమెరాను తీసుకెళ్లడం అలవాటు. తన ‘వీరమ్’ సినిమా షూటింగ్ సమయంలో, అజిత్ తన సహనటుల చిత్రాలను కూడా క్లిక్ చేసి, ఈ ఫోటోలను అందరికీ బహుమతిగా ఇచ్చాడు.

అజిత్‌కి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం..

అజిత్‌కి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. ఇంట్లో పుస్తకాల భారీ సేకరణ ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తనకు బహుమతిగా ఇచ్చిన ‘లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్’ తన అభిమాన పుస్తకంగా పేర్కొన్నాడు.

మెకానిక్‌గా ప్రారంభం..

అజిత్ నటనకు ముందు మెకానిక్‌గా కూడా పనిచేశాడు. అయితే నటించే అవకాశం వచ్చిన తర్వాత మళ్లీ అటువైపు వెనుదిరిగి చూసుకోలేదు.

Also Read: Niharika: సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చిన నిహారిక.. నేర్చుకున్న పాఠాలు ఇవేనంటూ పోస్ట్..

Sathyadev: కనిపించింది పది నిముషాలే కానీ.. చిరంజీవికే గురువు అయిపోయాడు.. మరోసారి మెగాస్టార్ సినిమాలో యంగ్ హీరో..