కరోనా నుంచి కోలుకున్న అర్జున్ తనయ

యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్ తనయ ఐశ్వర్య అర్జున్ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఐశ్వర్యకు నెగిటివ్‌గా తేలింది.

కరోనా నుంచి కోలుకున్న అర్జున్ తనయ

Edited By:

Updated on: Jul 28, 2020 | 7:55 AM

Aiswarya Arjun: యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్ తనయ ఐశ్వర్య అర్జున్ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఐశ్వర్యకు నెగిటివ్‌గా తేలింది. ఈ నెల 20న తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఐశ్వర్య వెల్లడించారు. ప్రస్తుతం తాను క్వారంటైన్‌లో ఉన్నానని, తనతో కాంటాక్ట్ అయిన వారందరూ టెస్ట్‌ చేయించుకోవాలని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇక తాజాగా ఈ నటి కరోనాను జయించారు. కాగా అర్జున్ కుటుంబంలో పలువురికి కరోనా సోకింది. అర్జున్ కుమార్తె ఐశ్వర్య, మేనల్లుడు ధృవ్ సర్జా, అతడి భార్య ప్రేరణా శంకర్‌కు కరోనా సోకింది. వీరంతా ఇప్పుడు కోలుకోవడంతో అర్జున్ కుటుంబం ఊపిరి పీల్చుకుంది.

Read This Story Also: అమరావతి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో మార్పులు‌.. రూ.3,500 కోట్లు ఆదా