అమరావతి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో మార్పులు‌.. రూ.3,500 కోట్లు ఆదా

టీడీపీ హయాంలో అనంతపురం- అమరావతి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

అమరావతి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో మార్పులు‌.. రూ.3,500 కోట్లు ఆదా
Follow us

| Edited By:

Updated on: Jul 28, 2020 | 7:39 AM

Anantapur to Amaravati Express Way: టీడీపీ హయాంలో అనంతపురం- అమరావతి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎక్స్‌ప్రెస్‌ వేను కోల్‌కతా-చెన్నై(ఎన్‌హెచ్‌ 16) రహదారికి సమాంతరంగా నిర్మించాలని అప్పటి ప్రభుత్వం భావించింది. అయితే ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో జగన్ ప్రభుత్వం మార్పులు చేపట్టింది. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వేను ఎన్‌హెచ్ ‌16కు సమాంతరంగా నిర్మించడానికి బదులు ఎన్‌హెచ్‌ 16తో అనుసంధానం చేసేలా నిర్మాణం చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. అంతేకాదు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంకు ప్రతిపాదనలు పంపగా.. అందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో మరో 47 కిలోమీటర్ల దూరం(గతంలో 101కి.మీలు) తగ్గనుండటంతో పాటు 741 హెక్టార్ల భూమిని సేకరించే ప్రతిపాదనలను వెనక్కి తీసుకోనున్నారు. దీంతో రూ.3,500 కోట్ల ఖర్చు తగ్గింది. కాగా ఈ ఎక్స్‌ప్రెస్‌ వేలో భాగంగా రూ.867 కోట్లతో చిలకలూరి పేట బైపాస్‌ నిర్మాణం ప్రారంభమైంది.

ఎక్స్‌ప్రెస్‌ వే వివరాలు:

అనంతపురం మొదలు వైఎస్సార్‌ కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం చేపట్టనున్నారు. ఇక ఈ ఎక్స్‌ప్రెస్‌ వే రూ.27,635 కోట్లు  ఖర్చు అవుతాయని అప్పటి ప్రభుత్వం అంచనా వేసినప్పటికీ.. తాజా మార్పులతో రూ.3,500కోట్లు ఆదాయం అవ్వనున్నాయి. ఇక ఈ ఎక్స్‌ప్రెస్‌వే వలన 148 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గడంతో పాటు 2 గంటల ప్రయాణ సమయం ఆదా అవ్వనుంది.

Read This Story Also: కేజీహెచ్ వద్ద డాక్టర్ నమ్రత హై డ్రామా