యంగ్ హీరోను కష్టపెడుతోన్న మహేష్..!

| Edited By:

Oct 22, 2019 | 2:56 PM

టాలీవుడ్‌లో వైవిధ్య హీరోల లిస్ట్‌లో అడివి శేష్‌ ముందు వరుసలో ఉంటారు. పూర్తి కమిట్‌మెంట్‌తో సినిమాలు చేసుకుంటూ వెళ్లడం ఇతడి స్పెషాలిటీ. అడివి శేష్ సినిమాలంటేనే అదో రకం కిక్.. అనే పేరు కూడా ఉంది. ఇక త్వరలో ఈ హీరో టాలీవుడ్ ప్రేక్షకులకు స్పెషల్‌ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. గూఢాచారి దర్శకుడు శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేషు మేజర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ముంబయి ఉగ్రదాడిలో అమరుడైన మేజర్‌ ఉన్ని క్రిష్ణన్‌ […]

యంగ్ హీరోను కష్టపెడుతోన్న మహేష్..!
Follow us on

టాలీవుడ్‌లో వైవిధ్య హీరోల లిస్ట్‌లో అడివి శేష్‌ ముందు వరుసలో ఉంటారు. పూర్తి కమిట్‌మెంట్‌తో సినిమాలు చేసుకుంటూ వెళ్లడం ఇతడి స్పెషాలిటీ. అడివి శేష్ సినిమాలంటేనే అదో రకం కిక్.. అనే పేరు కూడా ఉంది. ఇక త్వరలో ఈ హీరో టాలీవుడ్ ప్రేక్షకులకు స్పెషల్‌ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

గూఢాచారి దర్శకుడు శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేషు మేజర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ముంబయి ఉగ్రదాడిలో అమరుడైన మేజర్‌ ఉన్ని క్రిష్ణన్‌ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. క్రిష్ణన్ పాత్రలో అడివి శేషు నటిస్తున్నాడు. టేకప్‌ చేసిన ప్రతి మిషన్‌లోనూ అతడు చూపిన తెగింపు.. దేశం మొత్తాన్ని కదిలించింది. అటువంటి స్పూర్తివంతమైన పాత్ర కోసం ఇష్టంతో కష్టపడ్తున్నాడట అడివి శేష్‌. చేస్తున్నది మిలిటరీ రోల్ గనుక.. ఇప్పటికే బాగా బరువు తగ్గి.. ఫిట్‌గా కనిపిస్తున్నాడు. గత సినిమాల్లో ఎప్పుడూ కనిపించనంత డిఫరెన్స్‌తో మేకోవర్ అయ్యాడట అడివి శేష్.

ఇక ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్ మహేష్‌బాబు నిర్మిస్తుండటం మరో విశేషం. మహేష్‌ హోమ్ బేనర్‌ జీఎంబీ ప్రొడక్షన్స్‌ సోనీ పిక్చర్స్‌తో కలిసి తీస్తున్న ఈ మూవీ టాలీవుడ్‌లో వెరీవెరీ స్పెషల్‌ కానుందట. ఉన్నిక్రిష్ణన్‌ రియల్ లైఫ్ స్టోరీని ఆకట్టుకునేలా తియ్యడం కోసం.. ఆసక్తికరంగా తీర్చిదిద్దారట. ఇక ఈ నెలాఖరులో సెట్స్ మీదికెళ్లనున్న మేజర్‌ మూవీ.. వీలైనంత త్వరగా ఫినిష్‌ చేసి హిందీ-తెలుగు బైలింగువల్‌గా రిలీజ్ చేయాలన్నది ప్లాన్‌. ఓ మంచి లైఫ్‌స్టోరీని సమాజానికి చెప్పాలన్న ఆశయంతో తీస్తున్నానంటూ అప్పట్లో మేజర్‌ గురించి గొప్పగా చెప్పారు సూపర్‌స్టార్ మహేష్‌బాబు.