ఆ రోజుల్లో రూమ్ రెంటుకు కూడా నాదగ్గర డబ్బుల్లేవు.. కెరియర్ స్టార్టింగ్‌‌‌లో ఈ యంగ్ హీరో ఇన్ని ఇబ్బందులు పడ్డాడా.!

టాలీవుడ్ లో టాలెంటడ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడవిశేష్. విభిన్నమైన కథలను ఎంపిక చేసుకయుంటూ.. హిట్స్ అందుకుంటున్నాడు.

ఆ రోజుల్లో రూమ్ రెంటుకు కూడా నాదగ్గర డబ్బుల్లేవు.. కెరియర్ స్టార్టింగ్‌‌‌లో ఈ యంగ్ హీరో ఇన్ని ఇబ్బందులు పడ్డాడా.!

Updated on: Dec 18, 2020 | 6:35 PM

టాలీవుడ్ లో టాలెంటడ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడవిశేష్. విభిన్నమైన కథలను ఎంపిక చేసుకయుంటూ.. హిట్స్ అందుకుంటున్నాడు. క్షణం, గూఢచారి సినిమాలతో వరుసహిట్లు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మేజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శేష్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమాల్లోకి వచ్చిన మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులగురించి అడవిశేష్ మాట్లాడారు. అమెరికాలో మంచి ఉద్యోగాన్ని వదిలి సినిమాల్లోకి వచ్చాను . కానీ నేను సినిమాల్లోకి రావడంతోనే నా దగ్గరున్న డబ్బులతో సినిమాను నిర్మించి తప్పుచేసాను. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో నా డబ్బులన్నీ పోయాయి. దాంతో ఆర్ధికంగా చాలా ఇబ్బందిపడ్డాను ఆతర్వాత కొన్నిసినిమాల్లో హీరోగా చేస్తున్న సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘పంజా’ సినిమాలో ఛాన్స్ వచ్చింది. నా స్నేహితులు కూడా నటించమని ప్రోత్సహించారు. దాంతో ఆ సినిమాలో నటించా. ‘పంజా’ సినిమా నా కెరియర్ కు చాలా ప్లెస్ అయ్యింది. ఆ తర్వాత ‘కిస్’ అనే సినిమా చేశాను. ఆ సినిమాను నేను పెట్టుబడులు పెట్టాను. ఆ మూవీకూడా ఫ్లాప్ అయ్యింది. ఒకానొక సమయంలో రూమ్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడ్డాను. అప్పుడు వచ్చిన సినిమాను కాదనకుండా చేసుకుంటూ వచ్చా.. ఆ సమయంలో కొన్ని ఇష్టం లేకుండా కూడా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు శేష్. ఇక ప్రస్తుతం నటిస్తున్న ‘మేజర్’ సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందని ధీమా వ్యక్తం చేసాడు అడవి శేష్.