Point Blank movie : విడుదలకు ముందే ఆన్‌‌‌‌‌‌లైన్‌‌‌‌లో ప్రత్యక్షమైన సినిమా.. పోలీసులను ఆశ్రయించిన చిత్రయూనిట్

జబర్దస్త్ కార్యక్రమంతో చాలా మంది కమెడియన్లు ఫెమస్ అయ్యారు. కొంతమంది సినిమాలతో బిజీగా ఉన్నారు. వీరిలో అదిరే అభి , గడ్డం నవీన్ కూడా ఉన్నారు...

Point Blank movie : విడుదలకు ముందే ఆన్‌‌‌‌‌‌లైన్‌‌‌‌లో ప్రత్యక్షమైన సినిమా.. పోలీసులను ఆశ్రయించిన చిత్రయూనిట్

Updated on: Jan 12, 2021 | 4:22 PM

Point Blank movie : జబర్దస్త్ కార్యక్రమంతో చాలా మంది కమెడియన్లు ఫెమస్ అయ్యారు. కొంతమంది సినిమాలతో బిజీగా మారిపోయారు. వీరిలో అదిరే అభి , గడ్డం నవీన్ కూడా ఉన్నారు. అయితే అదిరే అభి హీరోగా గడ్డం నవీన్ ఓ సినిమాను నిర్మించాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ‘పాయింట్ బ్లాంక్’ అనే ఇంటరెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రయూనిట్ భావించింది. కానీ ఇంతలో ‘పాయింట్ బ్లాంక్’ టీమ్ కు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమా సడెన్ గా ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. సినిమా లీక్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు చిత్రయూనిట్. ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ కొన్నిపాటి శ్రీనాథ్ నిర్మించిన ‘పాయింట్ బ్లాంక్’ సినిమాకు సాయి పవన్ సంగీతం సమకూర్చగా.. పి.సి. కన్నా సినిమాటోగ్రఫీ అందించారు. వి.వి.ఎస్‌జీ దర్శకత్వం వహించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

zombie reddy movie : థియేటర్స్ లో విడుదలకానున్న `జాంబిరెడ్డి` .. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన నిర్మాతలు..

Irrfan Khan’s Son Babil : సినిమాల్లోకి మరో వారసుడు.. వెండితెర‌కు ప‌రిచ‌యం కానున్న దివంగత నటుడి కుమారుడు