Adarsh Gaurav: బాలీవుడ్ స్టార్ ఆదర్శ్ గౌరవ్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. బెస్ట్ యాక్టర్ కేటగిరి కింద ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్స్‌కు నామినేట్ అయ్యారు. ‘ది వైట్ టైగర్’లో యాక్టింగ్‌గాను ఈ అవార్డుకు నామినేట్ అయిన గౌరవ్.. భారత్‌కు చెందిన నటుడు అందుకున్న అత్యున్నత గౌరవాల్లో ఇది ఒకటి. దీంతో ఈ మూమెంట్‌ను సెలెబ్రేట్ చేసుకోవాలంటున్నారు సెలెబ్రిటీలు. ఆదర్శ్‌ను చూస్తే గర్వంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవానికి మూడు రోజులకు ముందుగా అంటే ఏప్రిల్ 22న 36వ ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుండగా.. జనవరి 26న నామినేషన్లను ప్రకటించారు. ఇందులో చైతన్య తమ్హానే డైరెక్షన్‌లో వచ్చిన ‘ది డిసిపుల్’ మూవీ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ కేటగిరిలో నామినేట్ అయింది.