Tollywood : పింపుల్స్ రాకుండా ఉండేందుకు ఉదయాన్నే ముఖానికి ఉమ్మి రాస్తా.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్..

మొటిమలు మొండిగా, చికాకుగా ఉంటాయి, కానీ వాటిని సహజంగా వదిలించుకోవడానికి అనేక సున్నితమైన, ప్రభావవంతమైన పద్ధతులు ఉన్నాయి. అయితే సెలబ్రెటీల స్కిన్ కేర్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ చాలా ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ తన లాలాజలంలో సహజ యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయని.. అందుకే దానిని మొటిమలపై పూస్తానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించి చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

Tollywood : పింపుల్స్ రాకుండా ఉండేందుకు ఉదయాన్నే ముఖానికి ఉమ్మి రాస్తా.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్..
Tamannah

Updated on: Oct 28, 2026 | 8:58 PM

టాలీవుడ్, బాలీవుడ్‌లో గ్లామర్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి తమన్నా భాటియ. తెలుగు, హిందీలో అగ్ర హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే వెండితెరపై ఎప్పుడూ మెరిసిపోయే నటీనటులకూ మొటిమలు వస్తాయని, తమకు కూడా ఇలాంటి సమస్యలు సాధారణమేనని ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అయితే, ఎంతో మంది సెలబ్రిటీలు ఖరీదైన క్రీములు, ప్రొడక్ట్స్ వాడతారని అందరూ భావిస్తారు. కానీ, తమన్నా తన మొటిమలను తగ్గించుకోవడానికి చెప్పిన ఒక విచిత్రమైన , ఆశ్చర్యకరమైన బ్యూటీ టిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మొటిమలు తగ్గించడానికి తాను ఏ ఉపాయం వాడతారని అడిగినప్పుడు, తమన్నా ఎవరూ ఊహించని విధంగా “ఉపశమనం కోసం ఉమ్మి వాడతాను” అని బదులిచ్చారు. మొదట్లో దీన్ని విన్న హోస్ట్, ఆడియన్స్ ఆశ్చర్యపోయినా, ఆమె మాత్రం తన అనుభవాన్ని ధైర్యంగా పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే బ్రష్ చేయకముందు నోట్లో ఉండే లాలాజలాన్ని నేరుగా మొటిమలపై రాసుకుంటానని ఆమె తెలిపారు. రాత్రి అంతా నిద్రపోయాక నోటిలో ఉండే సహజసిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఆ మొటిమలను త్వరగా ఎండిపోయేలా చేసి మాయం చేస్తాయని ఆమె పేర్కొన్నారు. అయితే, సెలబ్రిటీలు చెప్పే ఇలాంటి విచిత్రమైన హ్యాక్స్ అందరికీ వర్తిస్తాయా అంటే డెర్మటాలజిస్టులు మాత్రం భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైద్యపరంగా చూస్తే లాలాజలంలో కొన్ని ఎంజైమ్‌లు ఉన్నప్పటికీ, ఇది అందరి చర్మానికి సురక్షితం కాదని, కొన్నిసార్లు చర్మంపై బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, తమన్నా చెప్పిన ఈ విచిత్రమైన బ్యూటీ హ్యాక్ మాత్రం ప్రస్తుతం నెట్టింట నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ ట్రెండింగ్‌లో నిలిచింది.

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

ముంబైకి చెందిన చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ మీనల్ ఖరే మాట్లాడుతూ, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా వాపును తగ్గించడానికి, అధిక నూనెను సమతుల్యం చేయడానికి గాయం మానడాన్ని వేగవంతం చేయడానికి సహాయపడే సహజ నివారణలకు కొరత లేదని అన్నారు. తాజా కలబంద జెల్ వాపును తగ్గించడానికి పనిచేస్తుంది , ఇందులో సాలిసిలిక్ ఆమ్లం, సల్ఫర్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ మొటిమల నివారణ ఉత్పత్తులలో తరచుగా కనిపిస్తాయి. మొక్క నుండి తీసిన జెల్‌ను నేరుగా ఉపయోగించడం వల్ల వాపును తగ్గించి, చర్మాన్ని బాగు చేయడానికి సహాయపడుతుంది. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది సెబమ్ ఉత్పత్తిని కూడా తగ్గిస్తుంది. ఒక గ్రీన్ టీ బ్యాగ్‌ను మరిగించి, దానిని చల్లార్చి, అందులో దూదిని నానబెట్టి మీ ముఖానికి అప్లై చేయండి. చర్మం బిగుసుకుపోకుండా ఉండటానికి ప్రతిరోజూ 10–15 నిమిషాల పాటు ఇలా ఉంచుకోండి.

ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..

తమన్నా పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి :  Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..

Loading...
Unable to load recommendations.
Follow Us