Samantha: రష్యా దాడులపై స్పందించి నటి సమంత.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌.

|

Mar 01, 2022 | 6:20 AM

Samantha: ఉక్రెయిన్‌పై రష్యా (Russia Ukraine War) దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం ఆగాలని, ఈ సమస్యకు ఫుల్‌ స్టాప్‌ పడాలని ప్రపంచమంతా కోరుతున్నా రష్యా మాత్రం తగ్గడం లేదు. ఓవైపు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నా...

Samantha: రష్యా దాడులపై స్పందించి నటి సమంత.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌.
Samantha On Ukrainian
Follow us on

Samantha: ఉక్రెయిన్‌పై రష్యా (Russia Ukraine War) దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం ఆగాలని, ఈ సమస్యకు ఫుల్‌ స్టాప్‌ పడాలని ప్రపంచమంతా కోరుతున్నా రష్యా మాత్రం తగ్గడం లేదు. ఓవైపు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నా మరోవైపు రష్యా దాడులు మాత్రం ఆగడం లేదు. ఇక ఉక్రెయిన్‌ సైతం రష్యా దాడులను సమర్థవంతంగా తిప్పి కొడుతున్నాయి. ఆ దేశ అధ్యక్షడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) వెన్ను చూపకుండా రష్యాతో పోరు చేశారు. అధ్యక్షుడి హోదాను సైతం పక్కన పెట్టి కదన రంగంలోకి దిగి సైనికుడి అవతారమెత్తారు. దీంతో జెలెన్‌స్కీ తెగువకు ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది. దేశాలతో సంబంధం లేకుండా అందరూ జెలెన్‌స్కీకి మద్ధుతు నిలస్తున్నారు. ఇప్పటికే పలువరు ఇంటర్నేషనల్‌ స్టార్స్‌ ఆయనకు మద్ధతుగా నిలువగా తాజాగా నటి సమంత కూడా జెలెన్‌స్కీకి మద్ధతు ఇచ్చారు.

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న సైనిక చర్యను తప్పు పట్టిన సమంత గత రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఈ విషయమై సమంత స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమర్‌ జెలెన్‌స్కీపై ప్రచురితమైన ఓ న్యూస్‌ ఆర్టికల్‌ లింక్‌ను షేర్‌ చేసిన సమంత.. ‘యోధుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడిని చరిత్ర కనుగొంది.. అతని తెగువ, ధైర్యసాహసాలే దానికి సాక్ష్యం’ అంటూ రాసుకొచ్చారు సమంత. ప్రస్తుతం సమంత చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌ అవుతోంది.

 

ఇదిలా ఉంటే రష్యా చేస్తున్న దాడులను ఆ దేశానికి చెందిన వారు కూడా ఖండిస్తున్నారు. రష్యా ప్రజలు రోడ్ల మీదికొచ్చి తమ దేశ చర్యను ఖండించిన విషయం తెలిసిందే. ఇక ఈ జాబితాలోకి రష్యా క్రీడకారులు కూడా వచ్చి చేరారు. ఉక్రెయిన్‌పై జరుగుతున్న దాడులను ఆపాలని రష్యా టెన్నిస్ క్రీడాకారిణి అనస్తాసియా పావ్లియుచెంకోవా విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో భయానక వాతావరణం నెలకొందని సోషల్‌మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది.

Also Read: Niti Aayog: చక్కెర, ఉప్పు ఎక్కువుండే పదార్థలపై ఫ్యాట్ ట్యాక్స్!.. స్థూలకాయాన్ని నివారించడానికి నీతి ఆయోగ్ సిఫార్సు..

మైనర్ పై లైంగిక వేధింపుల కేసు.. కోర్టు సంచలన తీర్పు.. శిక్ష పాటించాల్సిందేనని వ్యాఖ్య

Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 389, నిఫ్టీ 136 పాయింట్లు అప్..