Sai Pallavi: తాజా వివాదంపై స్పందించిన సాయి పల్లవి.. ఏమన్నారంటే..

Sai Pallavi: నటి సాయి పల్లవి వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ బ్యూటీ నటిస్తోన్న తాజా చిత్రం విరాట పర్వం విడుదల నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు..

Sai Pallavi: తాజా వివాదంపై స్పందించిన సాయి పల్లవి.. ఏమన్నారంటే..
Sai Pallavi

Updated on: Jun 16, 2022 | 8:19 PM

Sai Pallavi: నటి సాయి పల్లవి వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ బ్యూటీ నటిస్తోన్న తాజా చిత్రం విరాట పర్వం విడుదల నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలోనే సాయి పల్లవిపై హైదరాబాద్‌లోని సుల్తాన్‌ బజార్‌బజార్‌ పోలీసులకు భజరంగ్‌దళ్‌ నాయకులు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ఈ వివాదంపై ఎట్టకేలకు సాయిపల్లవి రెస్పాండ్‌ అయ్యారు. ఈ విషయమై తాజాగా సాయిపల్లవి మాట్లాడుతూ ఈ వివాదంపై ఇప్పుడే స్పందించనని చెప్పింది. ఈ వివాదంపై ఇప్పుడే మాట్లాడనని.. దానికి ఇది సమయం కాదని చెప్పింది. తాను కొంచెం టైమ్‌ తీసుకుని మాట్లాడతానని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

ఇదిలా ఉంటే విరాట పర్వం ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన సాయి పల్లవి. కశ్మీరీ ఫైల్స్‌ సినిమా ప్రస్తావన తీసుకొచ్చారు. కశ్మీరీ పండిట్లపై మతంపేరుతో జరిగిన హింస తప్పే. అదే సమయంలో గోరక్షణ పేరుతో జరిగే హింసని కూడా ఖండించాలని ఆమె వ్యాఖ్యానించారు.

దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. గోరక్షకులకు మీద సాయి పల్లవి చేసిన కామెంట్స్‌ అభ్యంతకరమని భజరంగ్‌ దళ్‌ కన్వీనర్‌ శివ రాములు ఆరోపించారు. సాయి పల్లవి గో రక్షకులను ఉగ్రవాదులతో ఎలా పోల్చుతుంది అంటూ విమర్శించారు. సాయి పల్లవి హిందూ సమాజానికి బే షరతుగా క్షమాపణలు చెప్పాలని లేక పోతే విరాట పర్వం సినిమాను అడ్డుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us