Rashmika Mandanna: రష్మికను డీగ్లామర్‌గా చూపించడానికి ఇంత మేకప్‌ వేశారా.? వైరల్‌ అవుతోన్న లేటెస్ట్‌ ఫోటో..

Rashmika Mandanna: సినిమాల్లో పాత్రలను అత్యంత సహజంగా చూపించే వారిలో మొదటి వరుసలో ఉంటారు దర్శకుడు సుకుమార్. రంగస్థలం సినిమాలో పాత్రలను తీర్చిదిద్దిన తీరు దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా..

Rashmika Mandanna: రష్మికను డీగ్లామర్‌గా చూపించడానికి ఇంత మేకప్‌ వేశారా.? వైరల్‌ అవుతోన్న లేటెస్ట్‌ ఫోటో..
Rashmika Mandanna

Updated on: Nov 14, 2021 | 5:07 PM

Rashmika Mandanna: సినిమాల్లో పాత్రలను అత్యంత సహజంగా చూపించే వారిలో మొదటి వరుసలో ఉంటారు దర్శకుడు సుకుమార్. రంగస్థలం సినిమాలో పాత్రలను తీర్చిదిద్దిన తీరు దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం తెరకెక్కుతోన్న ‘పుష్ఫ’లోనూ సుకుమార్‌ ఇదే పంథాను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ‘పుష్ప’ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్‌లుక్‌, పాటలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ఇందుకోసం స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ కూడా మాస్‌ లుక్‌ చూపించారు సుకుమార్‌. అప్పటివరకు స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తూ వచ్చిన బన్నీ ఈ సినిమాలో ఊర మాస్‌ లుక్‌లో ఉన్న లారీ డ్రైవర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఇక నేషనల్‌ క్రష్‌ రష్మికను కూడా డీగ్లామర్‌ పాత్రలో చూపిస్తున్నారు. ఇప్పటికే రష్మికకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌లు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

అయితే ముట్టుకుంటే కందిపోయేలా ఉండే రష్మికను డీగ్లామర్‌గా చూపించడానికి ఎంత మేకప్‌ వేశారో తెలుసా.? తాజాగా రష్మిక పోస్ట్ చేసిన ఓ ఫోటో ఈ విషయాన్ని చెబుతోంది. షూటింగ్‌ స్పాట్‌లో తన చేతిని ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేశారు రష్మిక. లంచ్‌ సమయంలో చేతులు కడుక్కోగా కేవలం అరచేతి భాగం మాత్రమే మేకప్‌ లేకుండా ఉంది. అరచేతిపైన మొత్తం మేకప్‌తో నిండిపోయింది. రష్మికను డీగ్లామర్‌గా చూపించడానికి సుకుమార్ ఎంతలా జాగ్రత్త తీసుకున్నాడో ఈ ఒక్క ఫోటో చూస్తే అర్థమవుతోంది. రష్మిక పోస్ట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇలా పాత్రల రూపకల్పనలో ఇంత పర్టికులర్‌గా ఉంటాడు కాబట్టే సుకుమార్‌ చిత్రాల్లోని పాత్రలకు అంతలా గుర్తింపు వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కదూ! ఇదిలా ఉంటే పుష్ప చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. మరి ఇన్ని అంచనాల నడుమ విడుదలవుతోన్న ఈ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Also Read: CPI Narayana: ప్రత్యేక హోదా ఇవ్వకపోతే.. వెంకయ్య నాయుడును ఏపీలో తిరుగనివ్వంః నారాయణ

Corona Vaccine: కోవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ పెంచాల్సిన అవసరం లేదు.. స్పష్టం చేసిన నిపుణులు!

Corona Vaccine: కోవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ పెంచాల్సిన అవసరం లేదు.. స్పష్టం చేసిన నిపుణులు!