
క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమ్రోగితోంది. అల్లు అర్జున్ పుష్ప సినిమా ఈ అమ్మడి రేంజ్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ఈ వయ్యారి భామ. తన సినిమాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉంటుంది ఈ అమ్మడు. చలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి సత్తా చాటింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది హిందీలో క్రేజీ మూవీస్ చేస్తుంది.
తాజాగా రష్మిక మందన్నహోలీ వేడుకలు చేసుకుంది. రష్మిక తన కుటుంబంతో కలిసి హోలీ జరుపుకోలేదు. ఆమె షూటింగ్ సెట్‌లోనే హోలీ వేడుకలు జరుపుకున్నారు. హోలీ సెలబ్రేషన్ కు సంబంధించిన ఫోటోను రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ఈసారి హోలీ మనందరికీ పని ఉంది. అయితే మీరందరూ సురక్షితంగా హోలీ ఆడుతూ ఆనందిస్తున్నారని ఆశిస్తున్నాను. రష్మిక మందన్న తన టీమ్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ, “ఇక్కడి నుండి మీకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని చెప్పారు. అభిమానులు కూడా రష్మికకు కామెంట్స్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
‘పుష్ప’, ‘యానిమల్’ చిత్రాలతో రష్మిక మందన్నకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ‘పుష్ప 2’, ‘రెయిన్‌బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘చవ్వా’ సినిమాల్లో నటిస్తుంది. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 విడుదల కానుంది. ఆ సినిమా విడుదలైన తర్వాత రష్మిక మందన్న పాపులారిటీ పాన్ ఇండియా స్థాయిలో పెరగనుంది. ఇక ఇటీవల ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు’ టీమ్ ప్రోమోలో రష్మిక మందన్న కనిపించింది. దీనినికొందరు వ్యతిరేకించారు. ఈ సహకారం అవసరం లేదు’ అని పలువురు విమర్శలు చేశారు. రష్మిక మందన్నకు ఇలాంటి ట్రోల్స్ మామూలే. కానీ అవేమి రష్మిక పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.