
కోట్లాది రూపాయల అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం ఈడీ, కస్టమ్స్ అధికారుల నిఘాలో ఉన్న కన్నడ హీరోయిన్ రన్యా రావు మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల బెయిల్ పై విడుదలైన ఈ ముద్దుగుమ్మ, కర్ణాటకలోని ప్రసిద్ధ హాసనాంబ దేవి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లి కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆమె దేవుడి దర్శనం చేసుకోవడం వరకు బాగానే ఉన్నా.. ఆలయ అధికారులు ఆమెకు అందించిన విఐపి ప్రొటోకాల్ , ప్రత్యేక మర్యాదలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రూ. 12.56 కోట్ల విలువైన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టై, ఇటీవలే షరతులతో కూడిన బెయిల్‌పై బయటకు వచ్చిన రన్యా రావు, తన తండ్రి (ఐపీఎస్ అధికారి రామచంద్రరావు) , కుటుంబ సభ్యులతో కలిసి హాసనాంబ దేవి దర్శనానికి వచ్చారు. సాధారణ భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ప్రభుత్వ విఐపి ప్రొటోకాల్ వాహనంలో తీసుకెళ్లి, నేరుగా గర్భగుడికి పంపి ప్రత్యేక పూజలు నిర్వహించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..
దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అధికారుల తీరుపై విరుచుకుపడుతున్నారు. “కోట్ల రూపాయల స్మగ్లింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న వ్యక్తికి అంత ప్రత్యేక మర్యాదలు ఏంటి? విఐపి ప్రొటోకాల్ వాహనంలో తీసుకెళ్లి మరీ దర్శనం చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది?” అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అధికారుల హోదాను, పవర్ ను ఉపయోగించి ఇలాంటి సౌకర్యాలు పొందడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. సాధారణ భక్తులకు ఒక న్యాయం, పెద్దలు , నేరారోపణలు ఉన్నవారికి ఒక న్యాయమా అంటూ కామెంట్లు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..
గతంలో కూడా ఈ గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్ లో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఆలయంలో దక్కిన ఈ ప్రత్యేక మర్యాదల వ్యవహారంతో రన్యా రావు పేరు మళ్లీ కన్నడ , సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..