వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. తొలి సినిమాతోనే తనదైన నటన, అందంతో ఆకట్టుకున్న ఈ చిన్నది మంచి విజయాన్ని నమోదుచేసుకుంది. ఆ తర్వాత పలు వరుస విజయాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించున్న ఈ బ్యూటీ.. దాదాపు అందరు యంగ్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది.
అయితే కొండపాలెం చిత్రం తర్వాత రకుల్ తెలుగు తెరకు కాస్త దూరమైంది. హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది అక్కడ ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి సౌత్‌లో తన సత్తా చాటేందుకు సిధ్దమైంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారతీయుడు2తో ప్రేక్షకులకు పలకరించేందుకు సిద్ధమవుతోంది. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
నిజానికి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోవాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యమవతూ వచ్చింది. అయితే తాజాగా రకుల్ ఈ సినిమాలో తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. భారతీయుడు2 తన కెరీర్‌లోనే ప్రత్యేకమైన సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుందని రకుల్ ధీమా వ్యక్తం చేసింది. ఇక తాను పోషించిన పాత్ర కూడా గతంలో కంటే చాలా భిన్నంగా ఉంటుందని, ఈ సినిమాలో తాను ఆత్మవిశ్వాసం కలిగిన అమ్మాయిగా కనిపిస్తానని చెప్పుకొచ్చింది.
ఈ సినిమాతో ప్రయాణం చేస్తున్నన్ని రోజులు, రోల్ తన నిజజీవితానికి దగ్గరగా ఉందనే భావన కలిగిందని చెప్పుకొచ్చిన రకుల్ భారతీయుడు సీక్వెల్‌కు సంబంధించి మరిన్ని విషయాలు వెల్లడించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నానని, కానీ ఇప్పుడు చెప్పలేనని అంది. దర్శకుడు శంకర్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చిందీ చిన్నది. కాగా ఈ సినిమాలో కాజల్, సిద్ధార్థ్‌లు కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..