అనతికాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది అందాల తార నయనతార. 2003లో మలయాళ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ అత్యంత తక్కువ సమయంలోనే సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ఏకంగా లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. ఇక సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే దర్శకుడు విఘ్నేష్‌ను ప్రేమ వివాహం చేసుకుంది నయన్.
సాధారణ నటిగా కెరీర్ మొదలు పెట్టి అసాధారణ స్థాయికి ఎదిగిన నయనతార జీవితంపై ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమోను సైతం విడుదల చేశారు. ఇందులో నయన తార కెరీర్ ఎలా మొదలైంది నుంచి వివాహం వరకు అన్నింటినీ చూపించనున్నారు. కాగా నెట్‌ఫ్లిక్స్ నయనతార పెళ్లి వేడుక డిజిటల్ హక్కులను ఏకంగా రూ. 25 కోట్లకు దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి.
రెండేళ్ల క్రితం పెళ్లికి సంబంధించి ప్రోమోను విడుదల చేయగా. ఇప్పుడు నయన్ డాక్యుమెంటరీని స్ట్రీమింగ్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైంది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే టైటిల్‌తో ఈ డాక్యుమెంటరీని ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తున్నారు. నవంబర్ 18వ తేదీ నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్టిక్స్ అధికారికంగా ప్రకటించింది.
ఇక నయనతార కెరీర్ విషయానికొస్తే.. కాలేజీ రోజుల్లో పార్ట్‌టైమ్ మోడల్‌గా పనిచేసిన నయనతారను చూసిన.. దర్శకుడు సత్యన్ అంతికాడ్ ‘మనస్సిక్కరే’లో నటిగా అవకాశం ఇచ్చారు. తొలుత దానిని తిరస్కరించిన ఆమె చివరకు ఓకే చెప్పారు. 2003లో ఇండస్ట్రీలోకి వచ్చిన నయన్.. మలయాళం, తమిళం, తెలుగులో వరుస చిత్రాల్లో యాక్ట్ చేశారు. తెలుగులోనూ దాదాపు అందరూ అగ్ర హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇక ‘నేను రౌడినే’ సమయంలో దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో ఏర్పడ్డ స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. అనంతరం కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట 2022లో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..