Keerthy Suresh: ‘గడిచిన సమయం నాకు పరీక్ష లాంటిది’.. వైరల్‌ అవుతోన్న కీర్తి సురేష్‌ ట్వీట్‌..

Keerthy Suresh: అనతి కాలంలోనే అగ్ర నటిగా పేరు సంపాదించుకుంది నటి కీర్తి సురేష్‌. చేసినవి కొన్ని సినిమాలే అయినా ఎక్కడ లేని క్రేజ్‌ను సొంతం చేసుకుందీ బ్యూటీ. 'మహానటి' సినిమాలో తన అద్భుత నటనతో...

Keerthy Suresh: గడిచిన సమయం నాకు పరీక్ష లాంటిది.. వైరల్‌ అవుతోన్న కీర్తి సురేష్‌ ట్వీట్‌..

Updated on: Jun 04, 2022 | 9:31 AM

Keerthy Suresh: అనతి కాలంలోనే అగ్ర నటిగా పేరు సంపాదించుకుంది నటి కీర్తి సురేష్‌. చేసినవి కొన్ని సినిమాలే అయినా ఎక్కడ లేని క్రేజ్‌ను సొంతం చేసుకుందీ బ్యూటీ. ‘మహానటి’ సినిమాలో తన అద్భుత నటనతో ప్రేక్షకులకు మెస్మరైజ్‌ చేసిన ఈ బ్యూటీ ఏకంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగుతో పాటు తమిళంలోనూ పలు సూపర్ హిట్ విజయాలను అందుకున్న ఈ చిన్నది ఆ తర్వాత కొన్ని వైఫల్యాలను ఎదుర్కొంది.

మిస్‌ ఇండియా, పెంగ్విన్‌, గుడ్‌ లక్‌ సఖి వంటి లేడీ ఓరియెంట్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ ముందు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. అయితే తాజాగా ‘సర్కారు వారి పాట’, ‘చిన్ని’ సినిమాలతో కీర్తి తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. రెండు భారీ విజయాలను ఆమెలో ఒక్కసారిగా జోష్‌ను నింపాయి. వరుస పరాజయల తర్వాత వచ్చిన రెండు బ్యాక్‌ టు బ్యాక్‌ విజయాలను ఎంజాయ్‌ చేస్తోంది కీర్తి.

ఇవి కూడా చదవండి

ఈ విషయమై ఆమె కాస్త భావోద్వేగానికి కూడా గురయ్యారు. ట్విట్టర్‌ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ లెటర్‌ను పోస్ట్‌ చేశారు. ఈ లెటర్‌లో కీర్తి.. ‘నటిగా ఉండడం ఎన్నో సవాళ్లతో కూడిన ప్రయాణం. ఎన్నో ఎత్తుపల్లాలను చూస్తుంటాం. ఇవే తరచూ మా గమ్యాన్ని నిర్ణయిస్తుంది. గడిచిన కొంత కాలం నాకు పరీక్షా సమయం. నా ప్రదర్శనను ప్రపంచానికి చూపించడానికి నేను నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందని నాకు అర్థమైంది’ అంటూ రాసుకొచ్చింది కీర్తి.

ఇక రెండు విజయాలను అందించిన సర్కారు వారి పాట, చిన్ని సినిమా దర్శకనిర్మాతలకు కీర్తి కృతజ్ఞతలు తెలిపింది. అలాగే తన బలం తన అభిమానులేనని, వారి వల్లే తాను ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నానంటూ, ఈ విషయంలో ఎంతో కృతజ్ఞతతో ఉంటానని చెప్పుకొచ్చింది కీర్తి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us