AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : విజయశాంతితో పది బ్లాక్ బస్టర్ హిట్స్.. అయినా ఒక్క కారణంతో 10 ఏళ్ల మాట్లాడలేదు.. టాలీవుడ్ హీరో..

నటుడు సురేష్ ప్రముఖ నటి విజయశాంతితో పదేళ్ల పాటు మాట్లాడకుండా ఉన్న సంఘటనను తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు విజయశాంతి లేడీ సూపర్ స్టార్ అయ్యాక, ఆమె చిత్రాలలో తాను చిన్న పాత్రలు చేయదలచుకోలేదని సురేష్ వెల్లడించారు. అలాగే తన సినీ ప్రయాణం, కెరీర్, ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

Tollywood : విజయశాంతితో పది బ్లాక్ బస్టర్ హిట్స్.. అయినా ఒక్క కారణంతో 10 ఏళ్ల మాట్లాడలేదు.. టాలీవుడ్ హీరో..
Vijayashanti
Rajitha Chanti
|

Updated on: Jul 02, 2026 | 10:51 AM

Share

నటుడు సురేష్ ఒకప్పుడు తెలుగులో ఫేమస్ హీరో. మొదట్లో కథానాయకుడిగా అలరించిన సురేష్.. తర్వాత సహయ నటుడిగా మారారు. విలన్ పాత్రలలో సైతం అదరగొట్టారు. అయితే చాలా కాలంగా సురేష్ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన నటనా ప్రస్థానం, తోటి నటీనటులతో తన అనుభవాలను పంచుకున్నారు. ప్రత్యేకంగా నటి విజయశాంతి, స్వర్గీయ నటి సౌందర్యల గురించి ఆయన వెల్లడించిన విషయాలు ఆసక్తిని రేకెత్తించాయి. విజయశాంతితో పదేళ్ల పాటు మాట్లాడకుండా ఉన్న కాలాన్ని సురేష్ గుర్తు చేసుకున్నారు. ఇద్దరూ కలిసి పది హిట్లు కొట్టినప్పటికీ, బాల్యంలో ఉన్న ఒక పట్టుదల కారణంగా పదేళ్ల పాటు మౌనం పాటించామని ఆయన తెలిపారు. తిరిగి ఆలోచిస్తే అసలు గొడవకు కారణం ఏమిటో కూడా గుర్తులేదని సురేష్ నవ్వేశారు. పదేళ్ల తర్వాత ఊటీలో మళ్లీ కలుసుకుని, చిన్న “హాయ్” చెప్పుకున్నామని, ఆ తర్వాత వారి మధ్య మాటలు మళ్లీ ప్రారంభమయ్యాయని వివరించారు.

విజయశాంతి లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగిన తర్వాత, ఆమె సినిమాలో హీరో పాత్రలు చాలా చిన్నవిగా మారాయని, పాటలకు, చివరి దృశ్యాలకు మాత్రమే పరిమితమయ్యాయని సురేష్ చెప్పారు. అటువంటి పాత్రలు తనకు రుచించవని, అందుకే ఆమె సినిమాలో నటించకూడదని నిర్ణయించుకున్నానని సురేష్ స్పష్టం చేశారు. ఆ తర్వాత సురేష్ తన కెరీర్‌లో అత్యంత గౌరవించే వ్యక్తులలో ఒకరైన సౌందర్య గురించి మాట్లాడారు. సౌందర్య అంటే కట్టుబొట్టు, వ్యక్తిత్వం విషయంలో ఓ హీరోయిన్ ఎలా ఉండాలో ఒక నిర్వచనం అని అన్నారు. తన మొదటి చిత్రం అమ్మోరు సమయంలో సౌందర్యను బెంగళూరు నుండి శ్యాంప్రసాద్ రెడ్డి ఎంపిక చేసి తీసుకొచ్చారని, అప్పుడు ఆమెకు 16-17 ఏళ్లు మాత్రమేనని సురేష్ తెలిపారు. ఆ వయసులో ప్రతి షాట్‌కు ముందు “సురేష్ గారు కరెక్టేనా? మీరు సీనియర్ కదా” అని అడిగే సౌందర్యను సురేష్ గుర్తు చేసుకున్నారు. అమ్మోరు సినిమా పూర్తి కాకముందే, ఆమెకు ఎనిమిది సినిమాలు విడుదలయ్యి పెద్ద స్టార్‌గా మారిపోయిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అయితే, స్టార్‌డమ్ వచ్చినా, ఎంతో పారితోషికం అందుకున్నా, అమ్మోరు నుండి ఆమె చివరి సినిమా దేవి పుత్రుడు వరకు సౌందర్య ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని సురేష్ చెప్పుకొచ్చారు. “కొంతమంది తమ పరిస్థితులను బట్టి, పారితోషికాన్ని బట్టి, తమ స్థానాన్ని బట్టి ప్రవర్తన మారుతుంటుంది గానీ, ఆమెలో ఎక్కడా బిహేవియర్ మారలేదు” అని సురేష్ చేతులెత్తి దండం పెట్టారు. ఒక ఆత్మీయుడిని, బంధువుని పలకరించినట్లే “సురేష్ గారు బాగున్నారండీ, ఇంట్లో అందరూ బాగున్నారండీ” అని ఆమె మాట్లాడేదని చెప్పారు. ఆమెలో తనకు నచ్చిన క్వాలిటీలలో ఒకటి ఆమె నవ్వు అని సురేష్ వివరించారు. “ఆమెకు అద్భుతమైన చిరునవ్వు ఉంది. చూస్తూ ఉండిపోవాలనిపించే నవ్వు. ఒక పక్కింటి పిల్లని చూసినట్టు, ఒక పల్లెటూరి అమ్మాయిని చూసినట్టు ముచ్చటేసే నవ్వు” అని అన్నారు. అంతేకాకుండా, ఆమె కళ్ళు ఎప్పుడూ చైతన్యవంతంగా, డాన్సింగ్ ఐస్‌లా ఉండేవని, జీవితం పట్ల ఆమెకు అద్భుతమైన ఉత్సాహం ఉండేదని సురేష్ గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..

విజయశాంతి, సురేష్..

Vijayashanti, Suresh

Vijayashanti, Suresh

ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..

Follow Us