శివ సినిమా కోసం నాగార్జునను ఆర్జీవీ ఎలా ఒప్పించారంటే.. ఆయన ఆ సీన్ చెప్తుంటే గుండె కొట్టుకుంది..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ జగన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. ఒక కీలకమైన సన్నివేశాన్ని ఆర్జీవి ఎంత వివరంగా వివరించారో, అది నాగార్జునను ఒప్పించడానికి ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో ఆయన గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

శివ సినిమా కోసం నాగార్జునను ఆర్జీవీ ఎలా ఒప్పించారంటే.. ఆయన ఆ సీన్ చెప్తుంటే గుండె కొట్టుకుంది..
Ram Jagan

Updated on: Nov 01, 2026 | 11:21 AM

అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబోలో వచ్చిన శివ సినిమా క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. అప్పట్లో ఈ సినిమాకు సంచలన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా నాగ్ స్నేహితుడిగా, కీలకపాత్ర పోషించారు నటుడు రామ్ జగన్. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతోపాటు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవి) దర్శకత్వంలో వచ్చిన ఐకానిక్ చిత్రం శివ షూటింగ్ సమయంలో తన మరపురాని అనుభవాలను వెల్లడించారు. తాను అంతకుముందు వంశీ, ఆర్. నారాయణమూర్తి వంటి దర్శకులతో పని చేసినప్పటికీ, శివ సెట్స్‌లో ఆర్జీవి చూపించిన నూతన శైలి తనను విస్మయానికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. శివ చిత్రంలో మేకప్ అనేది ఎవరికీ ఉండేది కాదని రామ్ జగన్ గుర్తు చేసుకున్నారు. అప్పటికే సుధాకర్, అక్కినేని అమల వంటి ప్రముఖ నటులు కూడా మేకప్ లేకుండానే షూటింగ్‌లో పాల్గొనేవారని, ఇది అప్పటి సినిమా మేకింగ్‌లో ఒక విప్లవాత్మక మార్పు అని ఆయన వివరించారు. లొకేషన్‌కి వచ్చిన తర్వాత కేవలం ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి క్రీమ్ రాసుకొని షాట్‌లో పాల్గొనేవారని, ఇది ఆర్జీవి సహజత్వానికి ఇచ్చిన ప్రాధాన్యతను చూపుతుందని రామ్ జగన్ అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

ఒకరోజు షూటింగ్ కోసం లొకేషన్‌కి వెళ్ళినప్పుడు, ఆర్జీవి రామ్ జగన్‌ను పిలిచి, సినిమాలో ఒక కీలకమైన సన్నివేశం గురించి అరటిపండు ఒలిచినట్టు వివరంగా వివరించారట. నాగార్జునను సినిమాకు రమ్మని పిలిచే సన్నివేశం అది. నాగార్జున రానప్పుడు, రామ్ జగన్, సుధాకర్ వెళ్ళిపోతారు. తరువాత నాగార్జున సినిమాకు తిరిగి వస్తాడు. ఈ సన్నివేశాన్ని ఆర్జీవి చాలా డీటెయిల్‌గా వివరించి, ఇది నాగార్జునను ఎంతగానో ప్రభావితం చేస్తుందని చెప్పినప్పుడు, దాని ప్రాముఖ్యత అర్థమైందని ఆయన తెలిపారు. అప్పటివరకు ఏ దర్శకుడు కూడా ఒక సన్నివేశం గురించి ఇంత వివరంగా చెప్పలేదని, ఇది తన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయిందని రామ్ జగన్ పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

నాగార్జునను సినిమాకు ఒప్పించేందుకు ఆర్జీవి ఇంగ్లీష్‌లో కథ చెప్పారని, హిప్నటైజ్ చేశారని అనేక మాటలు ప్రచారంలో ఉన్నాయని, అయితే తన సన్నివేశం ద్వారానే నాగార్జున ఒప్పించబడ్డారని ఆర్జీవి చెప్పినట్లు రామ్ జగన్ గుర్తు చేసుకున్నారు. ఈ విషయం స్వయంగా ఆర్జీవి కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారని ఆయన అన్నారు. డబ్బింగ్ దశకు చేరుకున్నప్పుడు, సుజాత డబ్బింగ్ థియేటర్లో ఆర్జీవి స్వయంగా దగ్గరుండి డబ్బింగ్ పనులు చూసుకున్నారట. ఒక పోరాట సన్నివేశం కోసం డబ్బింగ్ చెప్పేటప్పుడు, బ్యాట్‌తో కొట్టేది, రాతి మీద వేసి కొట్టేది వంటి దృశ్యాలను సింగిల్ టేక్‌లోనే పూర్తి చేయమని ఆర్జీవి చెప్పారని, తాను అదే విధంగా చేసి చూపించానని రామ్ జగన్ వివరించారు. ఈ ప్రదర్శనకు మెచ్చుకుంటూ ఆర్జీవి గ్లాస్ రూమ్ నుండి బయటకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారని, అది తనకు మర్చిపోలేని క్షణమని రామ్ జగన్ పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Loading...
Unable to load recommendations.
Follow Us