శ్రీరాముడిని ఎగతాళి చేయలేదు.. ఎట్టకేలకు వివాదంపై స్పందించిన ప్రకాష్ రాజ్..

నటుడు ప్రకాష్‌ రాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కేరళ లిటరరీ ఫెస్టివల్‌లో రాముడు పండ్లు దొంగిలించారంటూ ప్రకాష్ రాజ్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, మతపరంగా దుమారం రేపుతున్నాయి. రాముడిపై విషం చిమ్మేవాళ్లు కాలగర్భంలో కలిసిపోతారంటూ హిందూ సంఘ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వేర్వేరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్న వేళ.. ప్రకాష్ రాజ్‌ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు.

శ్రీరాముడిని ఎగతాళి చేయలేదు.. ఎట్టకేలకు వివాదంపై స్పందించిన ప్రకాష్ రాజ్..
Prakash Raj

Updated on: Apr 19, 2026 | 4:08 PM

నటుడు ప్రకాష్‌ రాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కేరళ లిటరరీ ఫెస్టివల్‌లో రాముడు పండ్లు దొంగిలించారంటూ ప్రకాష్ రాజ్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, మతపరంగా దుమారం రేపుతున్నాయి. రాముడిపై విషం చిమ్మేవాళ్లు కాలగర్భంలో కలిసిపోతారంటూ హిందూ సంఘ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వేర్వేరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్న వేళ.. ప్రకాష్ రాజ్‌ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. తన ప్రసంగంలోని మాటలను వక్రీకరించారని.. అవతార పురుషుడైన శ్రీరాముడిని ఎగతాళి చేయలేదని వివరణ ఇచ్చారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసేవాళ్లు తనను యాంటీ హిందువుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు.

‘‘కేరళ లిటరరీ ఫెస్టివల్‌లో నా మాటలను వక్రీకరించారు.. నేను శ్రీరాముడిని ఎగతాళి చేశానని.. హిందూమతాన్ని కించపరిచేలా మాట్లాడానని చెబుతున్నారు.. అన్ని మతాలను, అందరినీ ప్రేమించేనాకు ఆ అవసరం లేదు.. ధర్మాన్ని, మతోన్మాదాన్ని ముడిపెట్టి అసహ్యకరమైన రాజకీయం చేస్తున్నవారు.. నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక పోతున్నారు. నన్ను హిందూధర్మ వ్యతిరేకి అని నిందించేందుకు ప్రయత్నిస్తున్నారు.. వాళ్ల ఏడుపు, వాళ్ల కష్టం నాకు అర్థమైంది.. వాళ్లకు సమాధానం చెప్పాలి.. త్వరలో వస్తా.. అప్పటిదాకా ఇలాగే వాగుతారో, ఊగుతారో మీ ఇష్టం’’.. అంటూ ప్రకాష్‌ రాజ్‌ వీడియోలో పేర్కొన్నారు.

వీడియో చూడండి..

వివరణ ఇవ్వడం కాదూ అన్‌కండీషనల్‌గా ప్రకాష్‌ రాజ్ క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కొంచెం బిజీగా ఉన్నా.. త్వరలో వస్తా అంటూ ట్విస్ట్ ఇచ్చారు ప్రకాష్‌ రాజ్‌. ఆయన వచ్చి ఏం మాట్లాడుతారన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us