Breaking: అర్జున్ మేనల్లుడు, నటుడు చిరంజీవి హఠాన్మరణం..!

యాక్షన్ హీరో అర్జున్ మేనల్లుడు, కన్నడ నటుడు చిరంజీవి సర్జా(39) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ఆయన ఆదివారం కన్నుమూశారు.

Breaking: అర్జున్ మేనల్లుడు, నటుడు చిరంజీవి హఠాన్మరణం..!

Edited By:

Updated on: Jun 07, 2020 | 5:34 PM

యాక్షన్ హీరో అర్జున్ మేనల్లుడు, కన్నడ నటుడు చిరంజీవి సర్జా(39) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ఆయన ఆదివారం కన్నుమూశారు. జూన్ 6న చిరంజీవికి శ్వాసకోశ సమస్య రావడంతో.. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయారు. శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడుతున్న చిరంజీవి తీవ్ర ఛాతీ నొప్పి కూడా వచ్చిందని, అందుకే మరణించినట్లు తెలుస్తోంది.

కాగా 2009లో ‘వాయుపుత్ర’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి దాదాపు 20 సినిమాల్లో నటించారు. ఆయన నటించిన ‘రాజామార్తాండ’కు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. మరో మూడు సినిమాలు షూటింగ్‌ దశలో ఉన్నారు. ఇక 2018లో నటి మేఘనా రాజ్‌ని చిరంజీవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే చిన్న వయస్సులో చిరంజీవి మరణించడంతో కన్నడ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మరణంపై సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

Read This Story Also: తన తదుపరి ప్రాజెక్ట్‌లపై స్పందించిన బాలయ్య..!