Breaking: లెజండరీ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ఖాన్‌ కన్నుమూత

| Edited By:

Jul 03, 2020 | 7:43 AM

లెజండరీ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ ఖాన్(72)‌ ఇక లేరు. రాత్రి గం.1.52ని.లకు కార్డియాక్‌ అరెస్ట్‌తో ఆమె కన్నుమూశారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న

Breaking: లెజండరీ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ఖాన్‌ కన్నుమూత
Follow us on

లెజండరీ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ ఖాన్(72)‌ ఇక లేరు. రాత్రి గం.1.52ని.లకు కార్డియాక్‌ అరెస్ట్‌తో ఆమె కన్నుమూశారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను గత నెల 17న ముంబయిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. కరోనా పరీక్షల్లో ఆమెకు నెగిటివ్‌ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. సరోజ్‌ ఖాన్‌ మరణవార్తతో బాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ‘ఆర్‌ఐపీ సరోజ్‌ఖాన్’ అంటూ పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

కాగా 3 సంవత్సరాల వయస్సులోనే బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టిన సరోజ్‌ఖాన్‌.. 1974లో కొరియోగ్రాఫర్‌గా మారారు. గీతా మేరా నామ్‌ కోసం ఆమె మొదటి సారిగా కొరియోగ్రఫీ చేశారు. బాలీవుడ్‌లో దాదాపు 2000వేల‌ పాటలకు ఆమె కొరియోగ్రఫీ చేశారు. మిస్టర్‌ ఇండియాలోని హవా హవాయి(1987), తేజబ్‌లోని ఏక్‌ దో దీన్(1988), బేటాలో దక్ దక్‌ కర్నే లగా(1992), దేవదాస్‌లో డోలా రే డోలా(2002) వంటి హిట్‌ పాటలకు ఆమె కొరియోగ్రఫీ చేశారు. చివరిసారిగా గతేడాది కళంక్‌ సినిమాలో మాధురీ దీక్షిత్‌ తాహబ్‌ హో గయే పాటకు ఆమె కంపోజ్‌ చేశారు. ఈ క్రమంలో మూడు సార్లు జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇక సరోజ్‌ ఖాన్‌ 1965లో సోహన్‌లాల్‌ని వివాహం చేసుకోగా.. ఆమెకు ఒక కుమారుడు(హమీద్‌ ఖాన్‌), ఇద్దరు కుమార్తెలు(హినా ఖాన్‌, సుక్యానా ఖాన్‌) ఉన్నారు.‌ స‌రోజ్ ఖాన్ అంత్య‌క్రియ‌లు శుక్ర‌వారం మ‌లాడ్ చౌకి ప్రాంతంలో జ‌రుగ‌నున్నాయి.