Chiranjeevi: ఇండస్ట్రీ షేక్‌ అయ్యే న్యూస్.. మెగాస్టార్‌ను డైరెక్ట్ చేయనున్న మాటల మాంత్రికుడు.?

2005లో చిరంజీవి హీరోగా వచ్చిన జై చిరంజీవ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కమర్షియల్‌గా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా, చిరు అభిమానులకు మాత్రం తెగ నచ్చేసింది. ముఖ్యంగా సినిమాలోని హ్యూమర్‌ డైలాగ్స్‌ చిత్రానికే హైలెట్‌గా నిలిచాయి. ఓవైపు తన కోడలిని చంపిన వ్యక్తినిపై పగ తీర్చుకునే వ్యక్తిగా కనిపిస్తూనే మరోవైపు కామెడీ సీన్స్‌తో....

Chiranjeevi: ఇండస్ట్రీ షేక్‌ అయ్యే న్యూస్.. మెగాస్టార్‌ను డైరెక్ట్ చేయనున్న మాటల మాంత్రికుడు.?
Trivikram Chiranjeevi

Updated on: Oct 03, 2023 | 6:32 PM

త్రివిక్రమ్‌ మార్క్‌ డైలాగ్స్‌, మెగాస్టార్‌ చిరంజీవి నోట పలికితే ఎలా ఉంటుంది.? ఆ ఊహే అద్భుతంగ ఉంది కదూ.! అయితే ఇది త్వరలోనే నిజం కానున్నట్లు తెలుస్తోంది. అవును మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మెగాస్టార్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందనేది సదరు వార్త సారంశం.

2005లో చిరంజీవి హీరోగా వచ్చిన జై చిరంజీవ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కమర్షియల్‌గా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా, చిరు అభిమానులకు మాత్రం తెగ నచ్చేసింది. ముఖ్యంగా సినిమాలోని హ్యూమర్‌ డైలాగ్స్‌ చిత్రానికే హైలెట్‌గా నిలిచాయి. ఓవైపు తన కోడలిని చంపిన వ్యక్తినిపై పగ తీర్చుకునే వ్యక్తిగా కనిపిస్తూనే మరోవైపు కామెడీ సీన్స్‌తో చిరు ప్రేక్షకులను అలరించారు. ఇక త్రివిక్రమ్‌ మాటలు సినిమాకే హైలెట్‌గా నిలిచాయన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్రివికమ్‌ మాటలతోనే సినిమాకు హైప్‌ వస్తే.. ఇక త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తే ఎలా ఉంటుంది.?

ఇప్పుడు ఇదే వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. త్రివిక్రమ్‌ దర్శత్వంలో చిరు హీరోగా సినిమా తెరకెక్కనుందనేది సదరు వార్త సారంశం. చిరు హిట్‌ మూవీకి త్రివిక్రమ్‌ సీక్వెల్ తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఆ సినిమా మరెదో కాదు.. చిరు కెరీర్‌లోనే ఆన్‌ ఆఫ్‌ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఖైదీ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ‘పగ తీర్చుకోవడం కోసం ఈ జన్మ ఎత్తాను. ప్రేమ కోసం మరోజన్మ ఎత్తుతాను. అప్పుడు కలుసుకుందాం’ అనే డైలాగ్‌తో ఖైదీ మూవీ ముగుస్తుంది.

అయితే ఇప్పుడు తెరకెక్కనున్న సీక్వెల్‌లో ఇదే లైన్‌ను తీసుకొని త్రివిక్రమ్‌ కథను సిద్ధం చేసుకుంటున్నాడని సమాచారం. ఈ సీక్వెల్‌కు సంబంధించి త్రివిక్రమ్‌ ఇప్పటికే చిరుతో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. చిరు కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేశాడన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తోన్న టాక్‌. ఇదిలా ఉంటే త్రివిక్రమ్‌ ప్రస్తుతం మహేష్‌ హీరోగా గుంటూరు కారం అనే సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తికాగానే చిరుతో సినిమాను పట్టాలెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇంతకీ ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..