త్వరలో తెరపైకి వరల్డ్ చెస్ ఛాంపియన్ విశ్వనాథ్ ఆనంద్ జీవితకథ .. హీరోగా ఆ తమిళ్ స్టార్

|

Dec 15, 2020 | 6:48 PM

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తుంది. ఇప్పటికే పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖుల జీవితకథలు సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

త్వరలో తెరపైకి వరల్డ్ చెస్ ఛాంపియన్ విశ్వనాథ్ ఆనంద్ జీవితకథ .. హీరోగా ఆ తమిళ్ స్టార్
Follow us on

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తుంది. ఇప్పటికే పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖుల జీవితకథలు సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా మరో క్రీడాకారుడి జీవిత కథ తెరపైకి రానుంది. ఇండియన్ చెస్ కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకు వచ్చి పలు సార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన విశ్వనాథ్ ఆనంద్ బయోపిక్ ను రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ఈ బయోపిక్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను కూడా పూర్తి చేసాడు. ఇక ఈ బయోపిక్ లో నటించే హీరో కు సంబంధించి పలువురి పేర్లు వినిపించాయి. చివరకు ఈ బయోపిక్ లో నటించే అవకాశం తమిళ్ స్టార్ హీరో ధనుష్ కు దక్కింది. ఇప్పటికే ధనుష్ పలు హిందీ సినిమాల్లోనూ నటించారు. ధనుష్ అయితేనే ఈ సినిమాకు అటు సౌత్ లోను ఇటు నార్త్ లోను సినిమాకు హైప్ వస్తుందని దర్శకుడు భావిస్తున్నాడట. ఇందుకు సంబంధించి దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ధనుష్ ను సంప్రదించారని తెలుస్తుంది. చెస్ ఛాంపియన్ విశ్వనాథ్ ఆనంద్ జీవితాన్ని కాస్త ఎంటర్టైన్మెంట్తో ఆకట్టుకునే విధంగా తెరకెక్కించేందుకు దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. మరి ఈ బయోపిక్ కు ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.