‘బుర్రకథ’ మోషన్ పోస్టర్ విడుదల

|

Apr 10, 2019 | 2:26 PM

యంగ్ హీరో ఆది కెరీర్‌లో బ్యాడ్ ఫేజ్‌ను ఎదుర్కుంటున్నాడు. ఈ మధ్యకాలంలో ఆది చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ ముందు చతికలపడుతున్నాయి. అందుకే కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు ఈ యంగ్ హీరో. తాజాగా ఆది ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’, ‘జోడి’,  ‘బుర్రకథ’ వంటి క్రేజీ ప్రాాజెక్ట్స్‌లో నటిస్తున్నాడు. ఇప్పటికే ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ టీజర్…’జోడి’  ఫస్ట్ లుక్ రిలీజై మంచి బజ్ క్రియేట్ చేశాయి.  ఇక తాజాగా ఆది మరో చిత్రం బుర్రకథ […]

బుర్రకథ మోషన్ పోస్టర్ విడుదల
Follow us on

యంగ్ హీరో ఆది కెరీర్‌లో బ్యాడ్ ఫేజ్‌ను ఎదుర్కుంటున్నాడు. ఈ మధ్యకాలంలో ఆది చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ ముందు చతికలపడుతున్నాయి. అందుకే కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు ఈ యంగ్ హీరో. తాజాగా ఆది ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’, ‘జోడి’,  ‘బుర్రకథ’ వంటి క్రేజీ ప్రాాజెక్ట్స్‌లో నటిస్తున్నాడు. ఇప్పటికే ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ టీజర్…’జోడి’  ఫస్ట్ లుక్ రిలీజై మంచి బజ్ క్రియేట్ చేశాయి.  ఇక తాజాగా ఆది మరో చిత్రం బుర్రకథ మోషన్ పోస్టర్ విడుదల చేసారు. ఇందులో ఆదిని డ్యూయల్ షేడ్ లో చూపించారు. స్పోర్ట్స్, స్టార్స్, హ్యబిట్స్ కి సంబంధించి పలు టైటిల్స్ ని మోషన్ పోస్టర్లో చూపించారు. రచయితగా మంచి పేరు సంపాదించుకున్న డైమండ్ రత్నబాబు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

దీపాల ఆర్ట్స్ పతాకంపై హెచ్‌కె శ్రీకాంత్ దీపాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది సరసన  మిష్తి చక్రవర్తి, నైరా షా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.  రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణ మురళి, పృథ్వీరాజ్, గాయత్రీ గుప్తా తదితరులు నటిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.