AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16 ఏళ్లలో 6 సీక్వెల్స్, అన్నీ సూపర్ హిట్లు, ఈ హారర్ ఫ్రాంచైజ్ ఇప్పటికీ నెంబర్ వన్..

16 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఒక హారర్ ఫ్రాంచైజ్ నేటికీ తన ప్రజాదరణను కోల్పోలేదు. రెండు లేదా మూడు చిత్రాలకే పరిమితం కాకుండా, ఏకంగా ఆరు భాగాలుగా వచ్చిన ఈ సిరీస్ ప్రత్యేకత ఏమిటంటే, విడుదలైన చిత్రాలలో ఏ ఒక్కటీ పెద్దగా ఫ్లాప్ కాలేదు.

16 ఏళ్లలో 6 సీక్వెల్స్, అన్నీ సూపర్ హిట్లు, ఈ హారర్ ఫ్రాంచైజ్  ఇప్పటికీ నెంబర్ వన్..
Insidious
Rajitha Chanti
|

Updated on: Aug 30, 2026 | 9:18 AM

Share

సినిమా ప్రపంచంలో హారర్ జోనర్‌కు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. వెన్నెముక చలింపజేసే దెయ్యాలు, భయానక వాతావరణం, ఊహించని మలుపులతో కూడిన కథలు థ్రిల్ ఇష్టపడేవారిని కట్టిపడేస్తుంటాయి. ఈ కోవలోనే హాలీవుడ్‌లో వచ్చిన ‘ఇన్సిడియస్ ‘ (Insidious) హారర్ ఫ్రాంచైజ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత పదహారేళ్ల కాలంలో ఈ సిరీస్ నుంచి వచ్చిన ఆరు భాగాలు కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను నమోదు చేసుకున్నాయి.

సాధారణంగా ఏవైనా సిరీస్‌లు ఎక్కువ భాగాలుగా వస్తున్నప్పుడు వాటిపై ఆసక్తి క్రమంగా తగ్గుతుంటుంది. కానీ ఇన్సిడియస్ విషయంలో మాత్రం ఇది పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది. జేమ్స్ వాన్, లీ వానెల్ సృష్టించిన ఈ భయానక ప్రపంచం మొదటి సినిమా నుంచి ఇటీవలి ఆరో భాగం వరకు ప్రేక్షకులను అదే స్థాయిలో భయపెడుతూ వస్తోంది. ‘ది ఫర్దర్’ (The Further) అనే చీకటి లోకం, ఆత్మల ప్రపంచం, మానవులను ఆవరించే దుష్ట శక్తుల కాన్సెప్ట్ ఈ సిరీస్‌కు ప్రధాన బలంగా నిలిచాయి.

చాలా తక్కువ బడ్జెట్‌తో అత్యంత ప్రతిభావంతమైన మేకింగ్‌తో తెరకెక్కిన ఈ చిత్రాలు హాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. కేవలం జంప్ స్కేర్లపై మాత్రమే కాకుండా, బలమైన కుటుంబ aభావోద్వేగాలు, భయపెట్టే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేశాయి. ప్రతి భాగంలోనూ కొత్త పాత్రలు, సరికొత్త సమస్యలతో కథను ముందుకు తీసుకెళ్లడం వల్ల హారర్ ప్రియులకు ఎక్కడా బోర్ కొట్టలేదు.

కాలం మారుతున్న కొద్దీ హారర్ సినిమాల ట్రెండ్ మారుతున్నప్పటికీ, ‘ఇన్సిడియస్’ ఫ్రాంచైజ్ మాత్రం తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ వచ్చింది. సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి సినిమా సూపర్‌హిట్ కావడమనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఈ సిరీస్, హారర్ సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సుమారు రూ. 171 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అంచనా ప్రకారం రూ. 610 కోట్లు వసూలు చేసింది. 16 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఇన్సిడియస్ సిరీస్, ఆరు చిత్రాల తర్వాత కూడా ప్రేక్షకులలో ఆసక్తిని నిలబెట్టుకోవడం హారర్ చిత్రాల ప్రపంచంలో ఒక అరుదైన ఘనత.

Follow Us